అర్జున్ కపూర్ కి ఇంత ఆంటీల పిచ్చా!

Arjun Kapoor affair with Malaika Arora Khan

12:27 PM ON 17th May, 2016 By Mirchi Vilas

Arjun Kapoor affair with Malaika Arora Khan

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్, అతని భార్య మలైకా అరోరాతో విడిపోవడానికి.. ఆమె అక్రమ సంబంధమే కారణమని తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. చాలా కాలంగా ఆమె బాలీవుడ్ స్టార్ హీరో అర్జున్ కపూర్ తో అక్రమ సంబంధం కొనసాగిస్తుందని అర్భాజ్ ఖాన్ ఆమెను వదిలేసాడని తెలిసిందే. అయితే.. ఆ తరువాత మలైకా అరోరా అర్భాజ్ ఖాన్ తో విడాకులు తీసుకుని తన కుమారుడుతో కలసి ముంబైలోని ఖర్ లో నివాసం ఉంటుంది. అయితే.. నిన్నటి వరకు ఒక రూమర్ గానే ఉన్న ఈ వార్తని ఇప్పుడు ఓ రిపోర్టర్ బయట పెట్టాడు. చాలా రోజులుగా అర్జున్ కపూర్ ని ఫాలో అవుతున్న ఓ రిపోర్టర్ కంటికి చిక్కాడు అర్జున్.

అర్జున్ కి తెలియకుండా అతను మలైకా ఇంటి వద్ద కాపు కాసి.. అతని కోసం ఎదురు చూసాడు. అనుకున్నట్లుగానే అర్జున్ అక్కడికి వచ్చాడు. మొదట అర్జున్ కారు డ్రైవర్ కిందకి దిగి.. అక్కడ ఎవరైనా ఉన్నారేమో అని చెక్ చేసి అర్జున్ కి ఎవరూ లేరని చెప్పడంతో.. అర్జున్ మలైకా అరోరా ఇంట్లోకి వెళ్లి చాలా సేపటి తరువాత వచ్చాడట. అయితే ఇంతలో పోలీసులు అక్కడికి వచ్చి ఆ రిపోర్టర్ ని వెళ్లిపోమనడంతో.. అతను అక్కడి నుండి వెళ్ళిపోయాడట. ఈ విషయాన్ని ఆ రిపోర్టర్ బయటకి చెప్పడంతో వాళ్ల ఎఫైర్ నిజమని తెలిసిపోయింది. ఈ విషయం తెలుసుకున్న బోనీ కపూర్ అతన్ని మందలించాడట..

ఇది విన్న బాలీవుడ్ జనం మాహ్త్రం అర్జున్ కి ఈ ఆంటీల పిచ్చి ఏమిటి? అని అనుకుంటున్నారు.. గతంలో కూడా అర్జున్ కరీనా కపూర్ కి అర్ధరాత్రి ఫోన్ చేసి సైఫ్ అలీ ఖాన్ తో వార్నింగ్ ఇప్పించుకున్న సంగతి తెలిసిందే..

English summary

Arjun Kapoor affair with Malaika Arora Khan. The affair rumour between Arjun Kapoor and Malaika Arora is true.