పోలీసు దుస్తుల్లో వచ్చి... జైలునుంచి తీసుకుపోయారు (వీడియో)

Armed men attack Nabha jail in Punjab

01:16 PM ON 28th November, 2016 By Mirchi Vilas

Armed men attack Nabha jail in Punjab

మధ్యప్రదేశ్ లో సిమి ఉగ్రవాదులను తప్పించడానికి చేసిన ప్రయత్నం మరువక ముందే పంజాబ్లోని నభా జైలుపై ఆదివారం ఉదయం సాయుధులైన 10 మంది దుండగులు దాడి చేసి కరడుగట్టిన ఓ ఉగ్రవాదిని, మరో నలుగురు మిలిటెంట్లను విడిపించుకుపోయారు. పోలీసు డ్రెస్ల్లో రెండు కార్లలో వచ్చిన వీళ్ళు, మొదట గార్డును కత్తితో గాయపరచి, జైల్లోకి దూసుకుపోయారు. జైలు సిబ్బందిపై వంద రౌండ్లు కాల్పులు జరిపారని, వారి కాల్పుల్లో ఇద్దరు పోలీసులు గాయపడ్డారని అధికారులు తెలిపారు. జైల్లో ఉన్న ఖలిస్తాన్ లిబరేషన్ ఫోర్స్ చీఫ్ హర్మిందర్ సింగ్ మింటూను, మరో నలుగురు ఉగ్రవాదులను దుండగులు విడిపించుకుపోయారని పోలీసులు చెప్పారు.

ఈ ఘటనతో పంజాబ్లో హై అలర్ట్ ప్రకటించి, పరారైన ఉగ్రవాదులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించారు. నిఘా వైఫల్యానికి బాధ్యులంటూ జైలు అధికారినొకరిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. జైలు డిప్యూటీ సూపరింటెండెంటును తొలగించింది. 49 ఏళ్ళ హర్మిందర్ సింగ్ మింటూపై ఉగ్రవాద సంబంధ కేసులు పది వరకూ ఉన్నాయి. 2014 నవంబరులో ఇతడిని ఢిల్లీ విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేశారు. అత్యంత భద్రత ఉన్న నభా జైలు నుంచి ఇతడిని, మరో నలుగురిని దుండగులు విడిపించుకుపోయిన ఘటనపై కేంద్రం ఆరా తీసింది. దీనిపై నివేదిక ఇవ్వాలని పంజాబ్ ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖ ఆదేశించింది.

అయితే, పంజాబ్ పోలీసులకు కాస్త ఊరట లభించింది. పటియాలా సమీపంలోని నభా జైలు నుంచి తప్పించుకున్న ఉగ్రవాదుల్లో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. తప్పించుకున్న వాళ్ళను పట్టుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసింది. కాగా తప్పించుకున్న ఉగ్రవాదుల్లో ఒకడైన పర్మిందర్ను ఉత్తరప్రదేశ్లోని షామ్లిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారులో వెళ్తున్న అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారులో నుంచి పెద్ద ఎత్తున మారణాయుధాలను స్వాధనం చేసుకున్నారు. తప్పించుకున్న కొన్ని గంటల్లోనే ఓ ఉగ్రవాదిని అరెస్ట్ చేసిన పోలీసులు మిగతా వారికి కోసం ముమ్మరంగా వేట సాగిస్తున్నారు. వారిని కూడా పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి: అందాలు ఆరబోసి... అమ్మేస్తోంది

ఇవి కూడా చదవండి: దేశంలో ఒక్క శాతం మంది దగ్గర 60 శాతం సంపద ... సర్వేలో షాకింగ్ విషయాలు

English summary

10 Armed Man attacked Nabha jail in Punjab and took 4 terrorists from jail. They have attacked the jail with full of weapons and they have injured the staff also. Special forces were in search for that four terrorists and searching for them.