సాహసం చూపిన డాగ్ కి అరుదైన గౌరవం

Army dog Mansi Awarded For Fighting Militancy

11:29 AM ON 16th August, 2016 By Mirchi Vilas

Army dog Mansi Awarded For Fighting Militancy

శత్రువును పసిగట్టి అతడి పీచమణిచే క్రమంలో అసువులు బాసిన సాహస శునకానికి వీరగౌరవం దక్కింది. బహుశా భారత మిలిటరీ చరిత్రలోనే ఇది ప్రథమమేమో! అని అంటున్నారు. మరణానంతరం ఈ గౌరవం దక్కిన తొలి శునకం పేరు మానసి. ఉత్తర కశ్మీర్లో టెర్రరిస్టుల చొరబాట్లను పసిగట్టి సైన్యానికి సమాచారం అందించేందుకు 160 ప్రాదేశిక సైన్యం డాగ్ స్క్వాడ్ ను ఉపయోగించుకోవడం సహజం. ఈ స్క్వాడ్ లోనే నాలుగేళ్ల మానసి, దాని సంరక్షకుడు బషీర్ అహ్మద్ వార్ పనిచేస్తున్నారు. ముగ్గురు టెర్రరిస్టుల చొరబాటును నిరోధించి వారిని మట్టుబెట్టిన చరిత్ర మానసి, బషీర్ లకు ఉంది. 2015 జూలై 21న తంగ్ ధర్ లో సరిహద్దుల వద్ద పహరాలో ఉండగా ఉగ్రవాదుల తూటాలకు ఇద్దరూ బలయ్యారు. ఆదివారం మానసిని మెన్షన్ ఆఫ్ డిస్పాచెస్ సర్టిఫికెట్ తో సైన్యం సత్కరించింది. అలాగే బషీర్ కు సేనా మెడల్ లభించింది.

ఇవి కూడా చదవండి:కువైట్ లో నౌకర్ పై చిత్ర హింసలు(వీడియో)

ఇవి కూడా చదవండి:ఇండియాలో స్వర్గ ధామం 'ట్రంప్ టవర్స్' (వీడియో)

English summary

A Military Dog Named "Mansi" was awarded for fighting Militancy. This dog helped Indian Army to kill Terrorists and this dog and this dog care Taker were killed in the hands of Terrorists.