జనరల్ కెవి కృష్ణారావు ఇకలేరు 

Army Ex-Cheif K.V.Krishna Rao Passes Away

05:41 PM ON 30th January, 2016 By Mirchi Vilas

Army Ex-Cheif K.V.Krishna Rao Passes Away

సైనికదళ మాజీ చీఫ్‌, మాజీ గవర్నర్‌ జనరల్ కేవీ కృష్ణారావు కన్నుమూశారు. ఈయన వయసు 93 సంవత్సరాలు. శనివారం ఈయన డిల్లీలోని ఆర్మీబేస్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కృష్ణారావు గతంలో భారత ఆర్మీ చీఫ్‌గా పనిచేశారు.కృష్ణారావు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో 1923 జనవరి 16న జన్మించారు. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ వ్యవస్థాపక వ్యక్తుల్లో ఒకరైన కృష్ణారావు మొదట్లో బ్రిటిష్‌ సైన్యంలో ఆ తర్వాత 1942 నుంచి 1983 వరకు భారత సైన్యంలో పనిచేశారు. 1968 నుంచి 83 వరకు భారత ఆర్మీ చీఫ్‌గా పనిచేసిన కృష్ణారావు రిటైర్ మెంట్ తర్వాత 1984 నుంచి 1989 వరకు ఏకకాలంలో నాగాలాండ్‌, మణిపూర్‌, త్రిపుర రాష్ట్రాల గవర్నర్‌గా పనిచేశారు.1988 మార్చి నుంచి 1990 వరకు ఒకసారి, 1993-1998 వరకు ఒకసారి రెండు సార్లు జమ్ము కశ్మీర్‌కి గవర్నర్‌గా పనిచేశారు. కృష్ణారావు మృతిపట్ల తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

English summary

Army Ex-Chief K.V.Krishna rao Passes away in Delhi Army Base Hospital.He was born on January 16, 1923 In Vijayawada ,Andhra Pradesh.