వైమానిక స్థావరంలో  ఉగ్రవాదుల కోసం గాలింపు   

Army High Alert In Hindon Air Force Station

11:35 AM ON 4th January, 2016 By Mirchi Vilas

Army High Alert In Hindon Air Force Station

భద్రతా చర్యల్ని సవాల్ చేస్తూ, దేశాన్ని కుదిపేసిన పఠాన్‌కోట్‌ ఉగ్రదాడి ఘటనలో ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. డిల్లీ శివారుల్లోని హిండాన్‌ వైమానిక స్థావరంలో అప్రమత్తత ప్రకటించారు. ఆసియాలోనే అతి పెద్దదైన ఈ వైమానిక స్థావరంపై పూర్తి నిఘా ఉంచారు. గత శనివారం వైమానిక స్థావరంలోకి ఉగ్రవాదులు చొచ్చుకు రావడంతో కాల్పులు జరిపారు. నలుగురు ఉగ్రవాదులను హతమార్చారు. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం మరో ఉగ్రవాదిని కాల్చి చంపారు. ఇంకా ఉగ్రవాదులు వున్నారని భావిస్తున్నారు. అందుకే గాలింపు చర్యలు మొదలయ్యాయి. మరోపక్క వైమానిక స్థావరం చుట్టుపక్కల గ్రామాలు, కాలనీల్లోని నివాసాల్లో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించేందుకు వైమానిక స్థావరం నుంచి పోలీసు కంట్రోల్‌ గదికి హాట్‌లైన్‌ను ఏర్పాటు చేశారు.అదనపు సైనికులను కూడా రప్పించి , మోహరించారు.

English summary

Due to sudden terrorist attack in Pathankot. Army has alerted in Aisa's biggest Air Force Station Hindon Air Force Station.Upto now Army has been killed 6 terrorists. In this incident 2 Army members were also lost their lives