మిస్ అమెరికాగా ఆర్మీ ఆఫీసర్..

Army officer is elected as a miss america

12:26 PM ON 7th June, 2016 By Mirchi Vilas

Army officer is elected as a miss america

మిస్ అమెరికాగా ఆ దేశానికి చెందిన 26 ఏళ్ళ జెషానా బార్బర్ ఎంపికయ్యింది. లాస్ వేగాస్ లోని టీ-మొబైల్ ఎరీనాలో జరిగిన అందాల పోటీల్లో ఈమె డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా తరఫున పోటీ చేసింది. ఈమె ఐటీ ఎనలిస్ట్ కూడా. సైన్యంలో పురుషుల కన్నా తామేమీ తీసిపోమని ఓ ప్రశ్నకు సమాధానంగా జెషానా పేర్కొంది. వార్ నుంచి తిరిగి వచ్చాక సైనికులు ఎదుర్కునే ఆరోగ్యపరమైన సమస్యలను హైలెట్ చేసి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె తెలిపింది. హవాయ్ కి చెందిన చెల్సీ హార్దిన్ ఫస్ట్ రన్నరప్ గా, మిస్ జార్జియా ఎమానీ డేవీస్ సెకండ్ రన్నరప్ గా నిలిచారు.

ఈ ఏడాది చివర్లో జరగబోయే మిస్ వాల్డ్ పోటీలకు జెషానా అమెరికా నుంచి ప్రాతినిధ్యం వహించనుంది. ఆర్మీలో పని చేసే ఓ అధికారి మిస్ అమెరికాగా ఎంపిక కావడం విశేషంగా చెప్పుకుంటున్నారు.

English summary

Army officer is elected as a miss america