బరిలోకి దిగుతున్న 'టెర్మినేటర్' తనయుడు

Arnold Schwarzenegger giving training to his son

03:00 PM ON 20th April, 2016 By Mirchi Vilas

Arnold Schwarzenegger giving training to his son

హాలీవుడ్ కండల వీరుడు ఆర్నాల్డ్ స్వార్జ్ నెగ్గర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అతని పేరు విన్న వెంటనే కొండల్లాంటి కండలు మన కళ్లముందు కదులుతాయి. 68 ఏళ్ల వయసులోనూ తన బాడీని అలాగే మెయిన్టైన్ చేస్తున్నాడు ఆర్నాల్డ్. ప్రపంచంలో ఎన్నో జిమ్ లకు ఆర్నాల్డ్ పేరే కనిపిస్తుంది అంటే అది అతిశయోక్తి కాదు. ఆర్నాల్డ్ ప్రపంచవ్యాప్తంగా అంతటి ఖ్యాతి పొందడానికి ప్రెడేటర్, టెర్మినేటర్ చిత్రాలే కారణం. అందులో ఆర్నాల్డ్ చేసే యాక్షన్ సన్నివేశాలకి ఎలాంటి వారైనా ఆశ్చర్యపోక మానరు. అంతలా తన ప్రత్యేకత చాటుకున్న ఆర్నాల్డ్ స్వార్జ్ నెగ్గర్ ఇప్పుడు తన కొడుకు జోసఫ్ కు బాడీ బిల్డంగ్ లో మెళుకువలు నేర్పుతూ హాలీవుడ్ లోకి తన తనయుడ్ని తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నాడు.

జిమ్ లో తనయుడికి 'జిమ్'క్కులు నేర్పుతూ సరికొత్త లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు. తండ్రి బాటలో పయనిస్తున్న జోసఫ్, మరో టెర్మినేటర్ అవుతాడో లేదో చూడాలి.

English summary

Arnold Schwarzenegger giving training to his son. Terminator hero Arnold Schwarzenegger giving training in gym for his son Jospeh Baena.