జక్కన్న పై అరెస్ట్‌ వారెంట్‌!

Arrest warrant issued on Rajamouli

01:55 PM ON 6th February, 2016 By Mirchi Vilas

Arrest warrant issued on Rajamouli

ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కించిన చిత్రం 'బాహుబలి'. ఇప్పుడు ఈ చిత్రానికి కొనసాగింపుగా 'బాహుబలి-2' తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే కేరళ లో ఘాటింగ్‌ జరుపుకున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌ వచ్చింది. అయితే కేరళ లో చిత్రీకరణ జరిపినప్పుడు అక్కడ ఓ ఏనుగు ని ఇబ్బంది పెట్టినట్లు కేసు నమోదైన విషయం తెలిసిందే. రాజమౌళి 2001 జంతు జట్టంని అతిక్రమించాడని కేరళలొ కేసు ఫైల్‌ చేశారు. ఇప్పుడు 'బాహుబలి' దర్శకుడు రాజమౌళి మరియు నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేనిల పై కేరళ కోర్టు అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. వారిని వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని కేరళ ప్రభత్వం ఆదేశించింది.

అయితే ఇది పెద్ద కేసేమి కాదని వివరణ ఇస్తే సరిపోతుందని కొంత మంది న్యాయవాదులు చెప్తున్నారు. ఇంతవరకు ఎటువంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగిపోతున్న 'బాహుబలి' కి ఇదొక మచ్చనే చెప్పాలి.

English summary

Arrest warrant issued on director S.S. Rajamouli for violencing Elephant in Baahubali 2 shhoting in kerala.