చిత్తూరు పోలీసులకు షాకిస్తోంది

Arrest warrant issued on Red Sandal Smuggler Sangeeta Chatterjee

11:24 AM ON 13th July, 2016 By Mirchi Vilas

Arrest warrant issued on Red Sandal Smuggler Sangeeta Chatterjee

అవును, ఎర్ర చందనం అక్రమ రవాణా కేసులో నిందితురాలు సంగీతా ఛటర్జీ చిత్తూరు జిల్లా పోలీసులకు షాకిస్తోంది. ఇప్పటికే ఆమెను అరెస్టు చేసేందుకు రెండు సార్లు కోల్ కత్తా వెళ్ళిన వీరికి ముచ్చెమటలు పట్టిస్తోంది. కేసు విచారణకు హాజరు కావాలన్న కోర్టు నోటీసులను ఆమె పట్టించుకోలేదు. సోమవారం నాటి విచారణకు హాజరు కాకపోతే అరెస్టు వారంట్లు జారీ చేస్తామని కోర్టు హెచ్చరించినా ఆమె నుంచి స్పందన లేకపోవడంతో ఇక ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు ... అరెస్టు వారంట్లు జారీ చేసింది.

ఈ వారంట్లను పట్టుకుని చిత్తూరు పోలీసులు మళ్ళీ కోల్ కత్తా వెళ్ళారు. సంగీత ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైదరాబాద్ హైకోర్టు కొట్టి వేయగా, ఈమె బెయిల్ పొడిగింపు పిటిషన్ ను కోల్ కత్తా కోర్టు కూడా తోసి పుచ్చింది. మరి ఇప్పుడు ఏమౌతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి:రాత్రి ఓ అమ్మాయి పిజ్జా ఆర్డర్ చేస్తే... డెలివరీ బాయ్ ఏం చేసాడో తెలుసా?

ఇవి కూడా చదవండి:అక్కడికెళ్లి పోలీస్ కేసులో ఇరుక్కున్న టీవీ నటి శ్రీవాణి

English summary

Red Sandal Smuggler Sangeetha Chatterjee was ordered by the court to attend in court but she was absent and recently court issued arrest warrant on her.