మార్కెట్ లో 'స్మార్ట్‌ చొక్కా' రెడీ... ఇది ఎలా పని చేస్తుందంటే...

Arrow launches smart shirt in market

04:58 PM ON 19th August, 2016 By Mirchi Vilas

Arrow launches smart shirt in market

అన్నింటా కొత్త హంగులు సమకూర్చే విధంగా సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రతి వస్తువులోనూ విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ గడియారాలను ప్రజలు విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. తాజాగా, తొలి స్మార్ట్ చొక్కా కూడా రెడీ అయింది. ప్రముఖ వస్త్ర తయారీ సంస్థ యారో స్మార్ట్ చొక్కాను మార్కెట్ లో రిలీజ్ చేసింది. వినియోగదారులు పలు పనులను చొక్కాతోనే సులభంగా పూర్తి చేయవచ్చు. యారో తయారు చేసిన ఈ చొక్కా మనం వినియోగించే స్మార్ట్ ఫోన్ కు అనుసంధానమై ఉంటుంది. ఇందుకు యారో మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి.

చొక్కా మణికట్టు వద్ద ఉన్న గుండీల్లో ఎన్ఎఫ్సీ చిప్ ను అమర్చారు. దీనికి మొబైల్ యాప్ అనుసంధానం చేయడంతో స్మార్ట్ చొక్కా తన పని మొదలెడుతుంది. 100 శాతం కాటన్ తో తయారు చేసిన ఈ చొక్కాను శుభ్రంగా ఉతకడమే కాకుండా చక్కగా ఇస్త్రీ కూడా చేసుకోవచ్చట. మనకు ఇష్టమైన పాటలను షర్ట్ కు ఉన్న బటన్ ను నొక్కడం ద్వారా నియంత్రిస్తూ వినవచ్చు. ఇకపై, అన్ని యారో ఔట్ లెట్లు, ప్రముఖ ఆన్ లైన్ దుకాణాల్లో ఈ స్మార్ట్ చొక్కా అందుబాటులో ఉంటుంది. ఇక ఎందుకు ఆలస్యం కొనడానికి రెడీ అవ్వండి.

English summary

Arrow launches smart shirt in market