'ఫేస్‌బుక్' ద్వారా హీరోయిన్ అయింది!!

Arthana became heroine with facebook

06:11 PM ON 22nd January, 2016 By Mirchi Vilas

Arthana became heroine with facebook

'ఉయ్యాల జంపాల' సినిమా తో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన హీరో రాజ్‌ తరుణ్‌. ఈ సినిమా మంచి హిట్టయ్యింది. దీని తరువాత వచ్చిన 'సినిమా చూపిస్తా మావ', కుమారి 21ఎఫ్‌ లతో వరుస విజయాలను సాధించాడు. రాజ్‌ తరుణ్‌ తాజా సినిమా 'సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు', ఈ సినిమా జనవరి 29న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా ద్వారా అర్తన హీరోయిన్‌ గా పరిచయం కానుంది. చాలా మంది సినిమా హీరోయిన్లు అవ్వడానికి చాలా కష్టపడతారు. కానీ అర్తన మాత్రం ఫేస్‌బుక్‌ ద్వారా హీరోయిన్‌ అయిపోయింది. ఇటీవల జరిగిన ఇంటర్‌వ్యూ లో అర్తన మాట్లాడుతూ తన ఫేస్‌బుక్‌ ప్రొఫైల్ లో ఉన్న ఫోటోలను చూసి ఈ సినిమా యూనిట్‌ తనని సంప్రదించారని చెప్పింది.

సినిమాలలో నటించడానికి ఆసక్తి ఉండటంతో ఈ సినిమాకి అర్తన ఒకే చెప్పిందట. ముందు హీరోయిన్‌ గా ఆ పాత్రను చెయ్యగలనో లేదోనని భయపడిందట కానీ కధ విన్నాక చెయ్యగలననే నమ్మకం వచ్చిందట. శ్రీశైలేంద్ర ప్రొడక్షన్స్‌ పతాకం పై కెవి శ్రీధర్‌ రెడ్డి, ఎస్‌. శైలేంద్రబాబు, హరీష్‌ దుగ్గిశెట్టిలు ఈ సినిమా నిర్మిస్తున్నారు. టాలెంటెడ్‌ డైరెక్టర్‌ ఎన్‌. శంకర్‌ రాజ్‌ ఈ సినిమాలో రాజ్‌ తరుణ్‌ తండ్రి పాత్రలో కనిపించనున్నాడు.

English summary

Seethamma Andalu Ramayya Sitralu movie heroine Arthana became as a heroine with Facebook. When seeing her photos in facebook movie team considered Arthana personally and selected as a heroine.