కళాకారిణిని చంపేసి ఆ తరువాత...దారుణం!!

Artist Hema murdered in mumbai

05:52 PM ON 14th December, 2015 By Mirchi Vilas

Artist Hema murdered in mumbai

గుజరాత్‌లో బరోడాకు చెందిన హేమ అనే చిత్రకారిణిని దారుణంగా హత్యచేసి, పెట్టిలో పెట్టి ముంబైలోని మురికి కాలువ పక్కన పడేశారు. హేమతో పాటు హేమ లాయర్ అయిన హరీశ్ భంభాణిని కూడా దారుణంగా హత్య చేసి మురికి కాలువ వద్ద పడేశారు. అర్ధనగ్నంగా పడి ఉన్న ఆ మృతదేహాలను ముంబై పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు చేపట్టిన పోలీసులు తమకు తెలిసిన సమాచారం ప్రకారం హేమ భర్త చింతన్‌ ఒక నటుడు. హేమ - చింతన్‌ల వివాహం 1998లో జరిగింది. వీరుద్దరూ సహ జీవనం సాగిస్తున్నారు.

అయితే వీరిద్దరూ ఉండే ఇంటి గోడల పై మహిళల అశ్లీల చిత్రాలు వేసి వేధిస్తున్నాడంటూ చింతన్‌ పై హేమ రెండేళ్ల క్రితం కేసు పెట్టింది. ఈ కేసుని హేమ తరుపున భంభానీ అనే లాయర్‌ వాధిస్తున్నారు. ఈలోగా ఇలా జరగడం అనేక అనుమనాలకి దారి తీస్తుంది. హేమ భర్త చింతన్ హేమని చంపించాడా? లేక వేరే ఎవరైనా చంపించారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. చింతన్‌ పై అనుమానంతో పోలీసులు చింతన్‌ని అదుపులోకి తీసుకున్నారు.

English summary

Artist Hema murdered in mumbai. And thrown into the pond.