బ్లాక్ మనీ కుంభకోణంలో దొరికేసిన స్టార్ నటులు.. ఎవరో తెలిస్తే షాకే!

Artists caught red handedly with black money

11:44 AM ON 17th November, 2016 By Mirchi Vilas

Artists caught red handedly with black money

భారతదేశంలో పెద్ద నోట్ల రద్దుతో కలకలం రేగితే, మరోపక్క పాకిస్థాన్ నటుల మేనేజర్లుగా పైకి కనిపిస్తూ నల్లధనం కుంభకోణానికి పాల్పడుతున్న వారి గుట్టు బట్టబయలైంది. ఓ టీవీ ఛానెల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో వీరి బండారం బయటపడింది. ఫవద్ ఖాన్, షఫ్ఖత్ అమానత్ అలీ, రాహత్ ఫతే అలీ ఖాన్, మావ్రా హొకేన్ వంటి నటుల మేనేజర్లను ఈ ఛానల్ విలేకర్లు రహస్యంగా చిత్రీకరించారు. అయితే ఈ ఆపరేషన్ నిజాయతీ, యథార్థతల గురించి స్పష్టత లేదు. ఆ టీవీ ఛానెల్ తెలిపిన వివరాలను పరిశీలిస్తే.. 

1/4 Pages

ఢిల్లీలోని ఓ పెద్ద పారిశ్రామికవేత్త వద్ద మేనేజర్లుగా పనిచేస్తున్నామంటూ ఈ ఛానల్ విలేకర్లు పాక్ నటుల మేనేజర్లకు పరిచయం చేసుకున్నారు. ఆ పారిశ్రామికవేత్త కుమార్తెకు వివాహం జరుగుతోందని, సంగీత్ కార్యక్రమంలో ప్రదర్శన ఇచ్చేందుకు నటులు కావాలని అడిగారు. షఫ్కత్ అనే పాకిస్థాన్ ఆర్టిస్ట్ వద్ద పనిచేస్తున్న మేనేజర్ మను కోహ్లిని మొదట కలిశారు. రూ.25 లక్షలు ఫీజు, సేవాపన్ను, ఇతర ఖర్చులు చెల్లించాలని కొహ్లి డిమాండ్ చేశాడు.

English summary

Artists caught red handedly with black money