కేజ్రీ ఏకాకేనా .....  కిం కర్తవ్యం

Arun Jaitley Case On Aravind Kejriwal

06:04 PM ON 23rd December, 2015 By Mirchi Vilas

Arun Jaitley Case On Aravind Kejriwal

ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్(డిడిసిఎ) వ్యవహారంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పై ఆరోపణలు గుప్పించిన ఆప్ నేత , డిల్లీ సిఎమ్ అరవింద్ కేజ్రీవాల్ చివరకు ఏకాకి గా మిగలక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో తనపైన , తన కుటుంబ సభ్యూలపైన అసత్య ఆరోపణలు చేసారంటూ కేజ్రీ బృందం పై జైట్లీ నిప్పులు చెరుగుతూ డిల్లీ హైకోర్టులో 10 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేసిన సంగతి తెల్సిందే.

ఈ వివాదంలో మరోపక్క క్రికెటర్లు మాత్రమే కాదు, మిగిలిన క్రీడారంగ ప్రముఖులు కూడా జైట్లీకి అండగా నిలుస్తుండడం చూస్తుంటే, కేజ్రీ ఏవిధంగా దీన్ని ఎదుర్కొంటారోనన్న ఆసక్తి నెలకొంది. ఇప్పటికే అరుణ్ జైట్లీకి వీరేంద్ర సెహ్వాగ్ - గౌతం గంభీర్ - ప్రస్తుత టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీలు మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బుధవారం జైట్లీకి మద్దతు ప్రకటించారు. రాజకీయ నాయకుడు ఎన్నికల ద్వారా ప్రజల చేత ఎన్నుకోబడతారనీ అందుకే వారి అధికారాలను ఎవరూ ప్రశ్నించజాలరని అన్నారు.

కాగా డీడీసీఏ నిధుల దుర్వినియోగం వ్యవహారంపై ఇంతకుముందే విచారణ జరిగిందని షూటింగ్ క్రీడాకారుడు - కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ పేర్కొంటూ, ఎటువంటి అక్రమాలు జరగలేదని విచారణలో తేలిందని అంటున్నారు. తన ముఖ్యకార్యదర్శిపై వచ్చిన అవినీతి ఆరోపణలకు సమాధానం చెప్పకుండా అసభ్య పదజాలంతో అరవింద్ కేజ్రీవాల్ ఎదురుదాడి చేస్తున్నారని కూడా రాథోడ్ వ్యాఖ్యానించారు. అవినీతిపరుడైన అధికారిని దగ్గర పెట్టుకుని అవినీతిరహిత పాలన అందిస్తామని కేజ్రీవాల్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

దేశం మెచ్చిన ప్రముఖ క్రికెటర్ల తో పాటూ పలువురు క్రీడా ప్రముఖులు కూడా జైట్లీకి మద్దతిస్తుండడంతో వారిని విమర్శించే ధైర్యం చేయడానికి కేజ్రీ వినుకంజ వేస్తున్నారు. జైట్లీని విమర్శించినంత తేలిగ్గా, సెహ్వాగ్ - గంగూలి - కోహ్లీ వంటివారిని విమర్శిస్తే, ఇక అభిమానులు కేజ్రీపై దుమ్మెత్తి పోస్తారనడంలో ఎలాంటి సందేహంలేదు.

జైట్లీ మీదా , ఆయన కుటుంబం మీదా డిడిసి ఎ అక్రమాలకు సంబంధించి ఆరోపణ లైతే చేసేసారు గానీ, క్రీడా ప్రముఖులను విమర్శించడం అంత 'ఈజీ' కాదని కేజ్రీకి ఇప్పటికే తెల్సి వచ్చినట్టుంది. దిక్కుతోచని విధంగా కేజ్రీ పరిస్థితి ఉందంటున్నారు. బాల్ విసురుదామంటే, అతని ముందే బాల్ పడ్డ చందంగా ఈ వ్యవహారం వుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి ఈ వ్యవహారంలో కేజ్రీవాల్ ఒంటరయ్యే సూచనలు కనిపిస్తున్నాయనడంలో సందేహం లేదు. ఈ పరిస్థితిని కేజ్రీ ఎలా ఎదుర్కొంటాడో .....

English summary

Previously Aravind Kejriwal comments on Ex- DDCA President and Now Central Minister Arun Jaitley . Due to that Arun Jaitley filed a case in Court on Kejriwal. Cricketers Virender Sehwag,Virat Kohli,Gautham Gambir and shooter Rathod supports Arun Jaitley