కేజ్రీ పై జైట్లీ పరువు నష్టం దావా

Arun Jaitley Case On Kejriwal

11:34 AM ON 21st December, 2015 By Mirchi Vilas

Arun Jaitley Case On Kejriwal

డిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పై కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ పరువు నష్టం దావా వేసారు. ఆయన మీద , ఆయన కుటుంబ సభ్యుల మీద కూడా అసత్య ఆరోపణలు చేసారన్న అభియోగంపై దావా వేసారు. ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్‌ (డి డి సి ఎ) అక్రమాల్లో తన మీద కేజ్రీ అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ డిల్లీ హైకోర్టులో జైట్లీ దావా వేసారు.

వివరాల్లోకి వెళితే, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గతంలో ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్‌కు జైట్లీ అధ్యక్షుడిగా వున్నారు. డిడిసిఏ అధ్యక్షుడిగా జైట్లీ పదమూడేళ్ల పాటు ఉన్నారు. ఈ సమయంలో భారీ అవినీతికి పాల్పడ్డారని కేజ్రీవాల్ సర్కార్ ఆరోపించింది. ఆయన కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ, ఆ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేసారు. ఈ నేపథ్యంలో ఆటగాళ్లు ఆయనకు మద్దతుగా నిలబడ్డారు. క్రికెటర్లు స్పందిస్తూ, జైట్లీని సమర్ధించారు.

వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, ఇషాంత్ శర్మ తదితరులు స్పందిస్తూ, జైట్లీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అవకతవకలు జరిగాయన్న ఆరోపణలను ఖండించారు. డిడిసీఏకు అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ఆటగాళ్లకు ఆయన అండగా నిలిచేవారే తప్ప ఎటువంటి అవకతవకలకు పాల్పడలేద ని వారు స్పష్టం చేసారు. కొన్ని సందర్భాల్లో ఢిల్లీ క్రికెట్లో ఆటగాళ్ల ఎంపికకు సంబంధించి ఏమైనా చెప్పవలసి ఉంటే నేరుగా ఆయన వద్దకు వెళ్లి చెప్పేవాళ్లమని సెహ్వాగ్ పేర్కొన్నారు.

అనవసరంగా జైట్లీని తప్పుబడుతున్నారని గౌతమ్ గంభీర్ పేర్కొన్నారు. ఈమేరకు ట్వీట్ చేశారు. వాస్తవానికి జైట్లీ హయాంలోనే ఢిల్లీ స్టేడియానికి ట్యాక్స్ మినహాయింపు లభించిందన్నారు. గుర్తింపు కూడా వచ్చిందన్నారు. ఢిల్లీ ఆటగాళ్లకు ఏ సాయం కావాల్సి వచ్చినా ఆయన ముందుండేవారని ఇషాంత్ శర్మ అన్నారు. ఆయనతో తాను ఎప్పుడు కలిసినా న్యాయపరంగా ఉండటమే కాకుండా ఆటగాళ్ల మధ్య ఎటువంటి తారతమ్యాలు లేకుండా వ్యవహరించేవారన్నారు. ఇక జైట్లీ కూడా స్పందిస్తూ కేజ్రీపై దావా వేసారు.

English summary

Central Union finance minister Arun Jaitley on Sunday Said That he is going to file a case on Delhi Chief Minister Arvind Kejriwal for his party's allegations of irregularity in the Delhi cricket body. Previously Arun Jaitley had headed the DDCA for 13 years till 2013