ప్రధాని మోదీ డిగ్రీ వివరాలపై ఆరా

Arvind Kejriwal Asked The degrees earned by Modi

12:00 PM ON 30th April, 2016 By Mirchi Vilas

Arvind Kejriwal Asked The degrees earned by Modi

రాజకీయాల్లో తెరిచిన పుస్తకంలా వుండాలని అంటారు. ఎంత జాగ్రత్తగా వున్నా ఏవో తప్పులు దొర్లవచ్చు , ఎవరైనా సరే ఏదో లాజిక్కు ప్రకారం ఇరుకున పెట్టవచ్చు. ఇది కూడా లాంటిదే. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ డిగ్రీ వివరాలు ఇవ్వాలని పీఎంవో కార్యాలయాన్ని సమాచార కమిషన్ కోరింది. ఢిల్లీ యూనివర్శిటీ నుంచి డిగ్రీ, గుజరాత్ యూనివర్శిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందినట్లు 2014 ఎన్నికల అఫిడవిట్‌లో మోడీ పేర్కొన్నారు. ఈ వివరాల కోసం సమాచార హక్కు చట్టం కింద దాఖలైన అర్జీలు తిరస్కణకు గురయ్యాయి. అయితే పత్రికల్లో వచ్చిన ఈ వార్తలపై స్పందించిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మోడీ డిగ్రీ వివరాలు ఎందుకు దాస్తున్నారని ప్రశ్నించారు. తన నివాసం, ఆస్తుల గురించి ఆర్టీఏ చట్టం కింద వివరాలు అడిగిన సమాచార కమిషన్‌, మోడీ విషయంలో ఎందుకు పక్షపాతం వహిస్తోందని నిలదీశారు. మోడీ డిగ్రీలకు సంబంధించిన వివరాలు కావాలంటూ కేంద్ర సమాచార కమిషన్‌కు ఆయన లేఖ రాశారు. దీన్నిఆర్టీఏ అర్జీగా స్వీకరించి సమాచారం అందిస్తామని క్రేజీవాల్‌కు బదులిచ్చింది. మోడీ డిగ్రీ వివరాల కోసం ప్రధాని కార్యాలయాన్ని ఆశ్రయించింది. సమాచార కమిషన్ చర్యను కేజ్రీవాల్ ట్విట్టర్‌లో స్వాగతించారు. మోడీ డిగ్రీ వివరాలు ప్రజలకు తెలిస్తే దీనిపై నెలకొన్న గందరగోళం తొలగిపోతుందన్నారు. మొత్తానికి కేజ్రీవాల్ వీలు దొరికితే చాలు ప్రధాని మోడీ ని టార్గెట్ చేస్తూనే వున్నారు.

ఇవి కూడా చదవండి:అనకొండను కాలితో పట్టుకున్న ఘనుడు(వీడియో)

ఇవి కూడా చదవండి:సంతానం కోసం భార్యని ఫ్రెండ్ తో అది చేయించాడు!

English summary

Delhi Chief Minister Asked the Degrees earned by Indian Prime Minister Narendra Modi . And Asked why they were not providing the details of PM by Right To Information Act.