రాజు గారి మాటలతో షాక్...

Ashok Gajapathi Raju On Special Status To AP

12:28 PM ON 9th May, 2016 By Mirchi Vilas

Ashok Gajapathi Raju On Special Status To AP

ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో వెంకయ్య ఇచ్చిన హామీ.. 2014 ఎన్నికల సమయంలో మోడీ స్వయంగా చేసిన వ్యాఖ్యలు ఏపీ ప్రజల మనసుల్లో ఇంకా పచ్చిగానే ఉన్నాయి. అయితే ప్రత్యేక హోదా సాధ్యం కాదంటూ బీజేపీ నేతలు కొంతకాలంగా వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. ఇక తాజాగా కేంద్రమంత్రులు ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదన్న విషయాన్ని తేల్చేయటంపై తీవ్రఆగ్రహాలు వ్యక్తమయ్యాయి.

ప్రత్యేక హోదా మీద కేంద్రమంత్రులు చేసిన వ్యాఖ్యలపై ఏపీ అధికారపక్ష నేతలు సైతం తీవ్రంగా మండిపడుతూ..మోడీ సర్కారు పై విమర్శనాస్త్రాల్ని సంధిస్తున్నారు. అయితే,ఈ వ్యవహారంపై కేంద్రమంత్రి.. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు చిత్రమైన విషయాల్ని తెరమీదికి తెచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని విభజన బిల్లులో చేర్చి ఉంటే సరిపోయేదని..ఆ పని కాంగ్రెస్ చేయలేదంటూ విమర్శలు చేస్తున్నగజపతి రాజు.ఏపీకి ప్రత్యేకహోదా పై ముగ్గురు ముఖ్యమంత్రులు వ్యతిరేకిస్తున్నారంటూ సంచలన ప్రకటన చేసేసారు. అయితే ఆ ముఖ్యమంత్రులేవరనే విషయం మాత్రం నన్ను అడగ వద్దంటూ చెప్పినా, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వటాన్ని తమిళనాడు.. కర్ణాటక.. బీహార్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యతిరేకిస్తున్నారని ఆయన మాటలను బట్టి అర్ధం అయింది. విభజన బిల్లులో కానీ ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చి ఉన్నట్లైయితే..ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదని. ఎవరూ అడ్డుకునే వారు కాదంటూ కొత్త రాగం తీసుతున్నారు.

ఇవి కూడా చదవండి:మీరు ప్రాణాలతో తిరిగి రావాలంటే అక్కడకు వెళ్లొద్దు( వీడియో)

పెద్దమనిషిగా కనిపించే అశోక్ గజపతి రాజు చెప్పిన మాటలు వింటున్న కొందరికి షాక్ తగులుతున్న పరిస్థితి. ఎందుకంటే.. అశోక్ గజపతి మాటలే నిజం అనుకుంటే.. విశాఖకు రైల్వే జోన్ అంశం విభజన చట్టంలో స్పష్టంగా ఉంది? మరి.. కేంద్రం గడిచిన రెండేళ్లుగా ఈ విషయాన్ని ఎందుకు తేల్చటం లేదు? పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత విభజన చట్టంలో ఉంది. మరి.. దానికి చిల్లర పైసలు విసురుతున్నట్లుగా నిధుల కేటాయింపు ఉంది. ఎందుకలా జరుగుతుంది? ఇవే కాదు.. విభజన కారణంగా ఏర్పడే ఏపీ లోటును పూడ్చాలంటూ చాలా స్పష్టంగా విభజన చట్టంలో ఉంది. మరి.. ఎందుకని మోడీ సర్కారు పూడ్చటం లేదు? ఇలాంటి ప్రశ్నలకు అశోక్ గజపతి సమాధానాలు చెబితే బాగుంటుందని పలువురు ఎద్దేవా చేస్తున్నారు. చేతకానితనాన్ని కవర్ చేయటం తప్పేం కాదు కానీ.. అందుకు భిన్నంగా కొత్త కొత్త వాటిని తెర మీదకు తీసుకొచ్చి కన్ఫ్యూజన్ క్రియేట్ చేయటం బాగోలేదని అంటున్నారు. పైగా సుదీర్ఘ రాజకీయ అనుభవం, వందల ఏళ్ళనాటి వంశ చరిత్ర గల అశోక్ గారు ఈవిధంగా మాట్లాడి, విలువ , పెద్దరికం పోగొట్టుకుంటే ఎలాగనే విమర్శలు వచ్చి పడుతున్నాయి. ఇంతకీ రాజు గారు అలా మాట్లాడడానికి కారణం ఎవరబ్బా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇవి కూడా చదవండి:17 ఏళ్లుగా మేడలో వున్న బులెట్ తొలగింపు

ఇవి కూడా చదవండి:మూడు గంటలు పాటు ముద్దు పెట్టించుకున్న కాజల్

ఇవి కూడా చదవండి:అప్పట్లో నేను , చిరు కన్నీరు పెట్టుకున్నాం

English summary

Central Minister Ashok Gajapati Raju made some Controversial Comments on Special Status to Andhra Pradesh State.He said that this position was occured to Andhra Pradesh because of Congress Party.He says that three Chief Ministers were opposing Special Status for Andhra Pradesh.