ఉత్తమ ఆల్‌రౌండర్‌గా అశ్విన్ 

Ashwin Tops In Cricket Allrounder Rankings

06:16 PM ON 8th December, 2015 By Mirchi Vilas

Ashwin Tops In Cricket Allrounder Rankings

భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్ట్ ఉత్తమ ఆల్‌రౌండర్లలో ప్రథమస్థానం సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజాగా విడుదల చేసిన ర్యాకింగ్స్‌లో ఆల్‌రౌండర్ల జాబితాలో అశ్విన్ తొలి ర్యాంక్ దక్కించుకున్నాడు. దక్షిణాఫ్రికాపై 3-0 తేడాతో సిరీస్‌ను దక్కించుకున్న టీమిండియా టెస్టు ర్యాకింగ్స్‌లో రెండో స్థానానికి ఎగబాకిన సంగతి తెలిసిందే. అయితే మంగళవారం ఐసీసీ విడుదల చేసిన బ్యాటింగ్, బౌలింగ్ ర్యాకింగ్స్‌లోన్లూ భారత ఆటగాళ్లు సత్తా చాటారు.

టాప్‌టెన్ బౌలర్లలో జడేజా

ఈ సిరీస్‌లో అంచనాలకు మించి రాణించిన రవీంద్ర జడేజా టెస్టు బౌలర్ల జాబితాలో పైకి ఎగబాకాడు. 11వ స్థానంలో ఉన్న జడేజా తాజాగా నాలుగు స్థానాలు మెరుగుపరుచుకుని 7వ ర్యాంక్‌కు చేరుకున్నారు. జడేజా టాప్‌టెన్‌లో చోటు దక్కించుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం.

రహానేకు 12వ ర్యాంక్

దిల్లీ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ శతకాలతో సఫారీలను చితకొట్టిన అజింక్య రహానే బ్యాట్స్‌మెన్ల జాబితాలో 12 స్థానాన్ని ఆక్రమించాడు. అ సిరీస్‌కు ముందుకు 26వ స్థానంలో ఉన్న రహానే ఏకంగా 14 స్థానాలు ఎగబాకి 12 ర్యాంక్ సాధించాడు. టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి సైతం రెండు స్థానాలు మెరుగుపరుచుకుని 14వ ర్యాంక్ సాధించాడు.

English summary

Indian all-rounder ravichandran ashwin stands in the top position of latest cricket rankings released by international cricket council ICC