'అసిన్' పెళ్లి ఫిక్స్‌!

Asin marriage date fixed

04:39 PM ON 31st December, 2015 By Mirchi Vilas

Asin marriage date fixed

'అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన మలయాళ ముద్దుగుమ్మ అసిన్‌ ఆ చిత్రం సూపర్‌ హిట్‌ కావడంతో తరువాత నాగార్జున 'శివమణి' చిత్రంలో నటించింది. అది కూడా హిట్ కావడంతో ఆ తరువాత బాలకృష్ణ, వెంకటేష్‌, ప్రభాస్‌, సూర్య, పవన్‌కళ్యాణ్‌ వంటి స్టార్‌ హీరోలతో నటించింది. అయితే 2008లో హిందీలో అమీర్‌ఖాన్‌ నటించిన 'గజిని' చిత్రంతో బాలీవుడ్‌కి మఖాం మార్చింది. అక్కడా సూపర్‌హిట్‌ చిత్రాల్లో నటించిన అసిన్‌ కొద్ది కాలం సినిమాలకి దూరంగా ఉంది. 2015 సంవత్సరంలో 'ఆల్‌ ఈజ్‌ వెల్‌' చిత్రంలో తప్ప మరే సినిమాలోనూ నటించలేదు.

అయితే ఈ అమ్మడు పెళ్లిపీటలు ఎక్కడానికి సిద్ధమయింది. మైక్రోమాక్స్‌ ని స్ధాపించిన రాహుల్‌ శర్మని అసిన్‌ ప్రేమ వివాహమాడబోతుంది. 2016 జనవరి 23న వీరిద్దరి పెళ్లి అంగరంగ వైభవంగా జరుగబోరతుంది.

English summary

Asin marrying Micromax co-founder Rahul Sharma on January 23rd.