ఆఫ్రికా అడవుల్లో అసిన్ హనీమూన్(వీడియోలు)

Asin-Rahul Sharma honeymoon in African forests

12:26 PM ON 19th April, 2016 By Mirchi Vilas

Asin-Rahul Sharma honeymoon in African forests

'అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి' చిత్రంతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయమైన కేరళ బ్యూటీ అసిన్ ఆ తరువాత నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలు సరసన నటించి కెరీర్ పీక్ స్టేజి లో ఉన్నప్పుడు బాలీవుడ్ కి మకాం మార్చింది. 2015 లో నటించిన 'ఆల్ ఈజ్ వెల్' చిత్రం తరువాత ఎ అమ్మడు మరే చిత్రంలోని కనిపించలేదు. అయితే తాజాగా అసిన్ మైక్రోమాక్స్ అధినేత రాహుల్ శర్మని ప్రేమ వివాహం చేసుకుంది. అయితే పెళ్లి తర్వాత అసిన్ జాడ లేదు. పెళ్లి తర్వాత అసిన్ హనీమూన్‌ కోసం అమెరికా వెళ్తున్నట్లు అప్పట్లో వార్తలొచ్చాయి.

అయితే అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ జంట జాడ తెలీలేదు. తాజాగా అసిన్- ఆమె భర్త రాహుల్‌శర్మలు విహారయాత్రలో మునిగి తేలుతున్నారు. ఇంతకీ ఈ జంట ఎక్కడికి వెళ్ళారో తెలుసా? అసిన్- రాహుల్ కలిసి ప్రస్తుతం ఆఫ్రికా అడవుల్లో ఎంజాయ్ చేస్తున్నారు. ఆఫ్రికా సఫారీలో తీసిన వీడియోలు, ఫొటోలను ఇన్‌స్ట్రాగ్రామ్‌ ద్వారా అభిమానులతో షేర్‌ చేసుకుంది అసిన్. మొత్తం మీద హనీమూన్ ని ఆఫ్రికా లో బాగా ఎంజాయ్ చేస్తుంది. ఒక్కసారి ఆ వీడియోలు మీరు కూడా వీక్షించండి.

My very own #AfricanJungleBook

A video posted by Asin Thottumkal (@simply.asin) on

Beauty ???? #AfricanSafari

A video posted by Asin Thottumkal (@simply.asin) on

He is the cutest most adorable lil guy! ???? #AfricanSafari #Singita

A video posted by Asin Thottumkal (@simply.asin) on

English summary

Asin-Rahul Sharma honeymoon in African forests. recently hot beauty Asin married Micromax co-founder Rahul Sharma. And now they went honeymoon to African forests. Asin recently posted the honeymoon videos in Instagram.