'ఆసిన్‌' రీ ఎంట్రీ !

Asin to make reentry Into Films

09:59 AM ON 26th February, 2016 By Mirchi Vilas

Asin to make reentry Into Films

‘‘అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి’’ తో తెలుగు అమ్మాయిలా అందరినీ ఆకట్టుకున్న 'అసిన్‌ తొట్టుంకల్‌' జనవరి 19న రాహుల్‌ శర్మను పెళ్ళాడింది. బాలీవుడ్‌ తార గా విస్తృత ప్రాచుర్యం పొందిన ఈ మలయాళ ముద్దుగుమ్మ కు అతి నిరాడంబరంగా జరిగిన ఈ పెళ్లి తొలుత క్రిస్టియన్‌ చర్చ్‌ లోను, తర్వాత హిందూ వివాహ పద్ధతిలో ఉభయతారకంగా నడిచింది. 2001లో మలయాళ తెర మీద పరిచయమై వెంటవెంటనే ఐదు తెలుగు సినిమాలలో నటించి, తెలుగమ్మాయే అనిపించింది. 2వ సినిమా ‘‘శివమణి’’ ఆతర్వాత ‘‘లక్ష్మి నరసింహ’’, ‘‘ఘర్షణ’’, ‘‘చక్రం’’ వంటి తెలుగు సినిమాలలో నటించి తానేమిటో రుజువు చేసుకుంది. ‘‘కుమరన్‌ సన్‌ ఆఫ్‌ మహాలక్ష్మి’’, ‘‘గజని’’, ‘‘ఉళ్ళం కేట్కుమే’’, ‘‘వరలరు’’, ‘‘ఆళ్వార్‌’’, ‘‘పోకిరి’’ వంటి విజయవంతమైన తమిళ చిత్రాల్లో నటించి బాలీవుడ్‌కు వెళ్ళిన ఆసిన్ కు హిందీ ‘‘గజని’’ సినిమా బాలీవుడ్‌ లో బాగా కల్సి వచ్చింది. ‘‘లండన్‌ డ్రీమ్స్‌’’, ‘‘రెడీ’’, ‘‘హౌస్‌ ఫుల్‌-2’’, ‘‘బోల్‌ బచన్‌’’, ‘‘ఖైదీ 786’’, ‘‘ఆల్‌ ఈజ్‌ వెల్‌’’ సినిమాలు బాలీవుడ్‌ లో ఆమె స్థానాన్ని పదిల పరిచాయి. ఇక ఆమె అందం కాల్గేట్‌, మిరిండా, ఆవన్‌, ప్యారాచూట్‌ వంటి వాణిజ్య ఉత్పత్తులకు బ్రాండ్‌ అంబాసడర్‌ని చేసింది. ఈమె స్పానిష్‌, ఫ్రెంచ్‌, జర్మన్‌ భాషలతో సహా అసిన్‌ ఏడు భాషల్లో మాట్లాడగలదు. ఆమె భర్త రాహుల్‌ శర్మ మైక్రోమ్యాక్స్‌ కంపెనీ వ్యవస్థాపకుల్లో ఒకరు. ఇదిలా వుండగా సేవా దృక్పధం మెండుగా ఉన్న ఆసిన్ శ్రీలంక సివిల్‌ వార్‌లో దెబ్బతిన్న మలయాళ కుటుంబాలకు స్వయంగా వెళ్లి ఆర్ధిక సహాయం చేసింది. ఇక పెళ్లి చేసుకునే ఉద్దేశ్యంతోనే ఆసిన్‌ 2014 తర్వాత సినిమాలు చేయడం మానేసింది. ఇక ఇప్పుడు రీ ఎంట్రీ ఇస్తుందా అని ఎదురు చూస్తున్న వాళ్లకు తీపు కబురు అందుతుందా ?

English summary

Asin was married to a business man recently and she was planning to make re enter into films.