ఛ అవేం ప్రశ్నలు... అక్కడ వాటి సైజులు అడుగుతున్నారట

Asking bra and panty sizes in Scotland

01:05 PM ON 6th April, 2016 By Mirchi Vilas

Asking bra and panty sizes in Scotland

దొంగ పెళ్ళిళ్ళు చేసుకుని, జల్సా గా తిరుగుతూ రాయితీలు పొందేవారికి అక్కడి ప్రభుత్వం ఇబ్బంది అయినా వినూత్న చెక్ పెడుతోంది. ఇంతకీ ఎక్కడ అంటే, వివరాల్లోకి వెళ్ళాలి. విదేశాల నుంచి అబద్ధపు వివాహాలు చేసుకుని వస్తూ.. రాయితీలు పొందాలనుకునేవారికి చెక్‌ పెట్టడానికి స్కాట్లాండ్‌ ప్రభుత్వం కొత్త టెక్నిక్ కనిపెట్టింది. అయితే దీని పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విదేశాల నుంచి స్కాట్లాండ్‌కు వచ్చి అక్కడి ఎయిర్‌ పోర్ట్‌ల్లో అడుగు పెట్టగానే.. ఇమ్మిగ్రేషన్‌ అధికారులు ప్రశ్నల పరంపర కొనసాగిస్తారు. మ్యారేజ్‌ సర్టిఫికేట్స్‌ ఎన్ని చూపించినా కుదరదు. వారు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెబితేనే మిమ్మల్ని స్కాట్లాండ్‌లో ఉండనిస్తారు.

ఇది కూడా చదవండి: 'సర్దార్' టికెట్ తో సమ్మర్ డ్రింక్ ఫ్రీ

తప్పుడు సమాధానం చెబితే తిరుగు ప్రయాణం కావాల్సిందే. ఇంతకీ వారడిగే ప్రశ్నలేంటంటే.. మీ వైఫ్‌ బ్రా సైజ్‌ ఎంత? మీ వైఫ్‌ ఈరోజు ధరించిన అండర్‌వేర్‌ కలర్‌ ఏంటి? వంటి ప్రశ్నలడుగుతారు. దానికి సరైన సమాధానం చెబితేనే బ్రిటన్‌లోకి ఎంట్రీ. అయితే ఈ ప్రశ్నల పట్ల సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. ‘నేను నా భార్యతో 28 సంవత్సరాలుగా కాపురం చేస్తున్నా. కానీ, నాకు తన బ్రా సైజ్‌ ఎంతో తెలియద’ని ఓ రాజీకీయ నాయకుడు వ్యాఖ్యానించడం గమనార్హం. అలాగే కేవలం ఆ రెండు ప్రశ్నలకు సమాధానాలు తెలిస్తే వారిని నిజమైన భార్యాభర్తలుగా గుర్తిస్తారా? అని కొంతమంది నిలదీస్తున్నారట. స్కాట్లాండ్‌ ప్రభుత్వం తీరు చాలా విచిత్రంగానూ, విమర్శలకు కారణంగానూ వుంది...

ఇది కూడా చదవండి: శ్రీ దుర్ముఖిలో మీ రాశి ఫలాలు తెలుసుకోండి

English summary

Asking bra and panty sizes in Scotland. Officers asking wife bra size and panty size for allowing them into country.