ఎఎస్పీ శశికుమార్ డెత్ కు కారణం ఏమిటి?

ASP Sasikumar Death Mystery

11:53 AM ON 18th June, 2016 By Mirchi Vilas

ASP Sasikumar Death Mystery

విశాఖజిల్లాలో పిస్టల్ పేలి పాడేరు ఎఎస్పి శశికుమార్ ప్రాణాలు కోల్పోయారు.అయితే ఈయన చనిపోవడం తీవ్ర కలకలం రేపుతోంది. శశికుమార్ తల నుంచి తుపాకీ బుల్లెట్ దూసుకుపోవడంతో ఇది మిస్ ఫైర్ అయిదా, సూసైడా ? లేక ఎవరైనా హత్య చేశారా అనేది సస్పెన్స్ గా మారింది. మొదట్లో మిస్ ఫైర్ అని వార్తలోచ్చినా ఆతర్వాత శీను మారింది. ఉన్నతాధికారుల వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు కూడా మీడియాలో వార్తలొచ్చాయి. అసలు ఎఎస్పీ బంగ్లాలో కాల్పుల మోత వినిపించడంతో హడలిపోయిన సిబ్బంది హుటాహుటీన బంగ్లాలోకి పరుగెత్తారు. అప్పటికే రక్తపు మడుగులో శశికుమార్ పడి ఉన్నారు.

తమిళనాడు సేలం ప్రాంతానికి చెందిన శశికుమార్ 2014 ఐపిఎస్ బ్యాచ్కు చెందిన ఈ యువ ఐపిఎస్ అధికారి ఆరునెలల క్రితం పాడేరులో ఎఎస్పీగా జాయిన్ అయ్యారు. గతంలో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఎఎస్ పిగా పనిచేశారు. ఈ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలపై ఆయన దృష్టి పెట్టి మంచి అధికారిగా పేరు తెచ్చుకున్నారు. శశికుమార్ కు కుటుంబసమస్యలేమైనా ఉన్నాయా? లేక ఆర్థిక సమస్యలు కారణమా..మరొకటా అనేది పోలీసులు ఆరాతీస్తున్నారు. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన శశికుమార్ మరణం తీరని లోటని పేర్కొన్న ఎపి హోంమంత్రి చినరాజప్ప, ఈ ఘటనపై సిఐడి విచారణకు ఆదేశించారు.

శశికుమార్ నుదుటి మీద బుల్లెట్ గాయం కావడం - మృతదేహం సమీపంలో సూసైడ్ నోట్ లభించడంతో ఇది ఆత్మహత్యేనన్న నిర్ధారణకు పోలీసు అధికారులు భావిస్తున్నారు. వృత్తిపరంగా వైఫల్యాలు ఎదుర్కొనడంతో తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆయన సూసైడ్ నోట్ లో రాశారని తెలిసింది. రాళ్లగడ్డ ఎన్ కౌంటర్ అనంతరం ఆయన ముభావంగా ఉంటున్నారని ఓ సీనియర్ పోలీసు అధికారితో విభేదాలున్నాయని కూడా తెలుస్తోంది.

కాగా పోలీసు అధికారుల నుంచి మరో వాదనా వినిపిస్తోంది. తల్లిదండ్రులు చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకే ఈ 30 ఏళ్ల యువ ఐపిఎస్ అధికారి ఆత్మహత్య చేసుకున్నాడన్న వాదన వినిపిస్తోంది. తమిళనాడులోని సేలం జిల్లా నుంచి వచ్చిన శశికుమార్ కుటుంబ సభ్యులను కూడా సిఐడి పోలీసులు విచారించనున్నారు. అయితే, ఉన్నతాధికారులతో విభేదాల నేపథ్యంలో ఆయన తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసు శాఖలోని కిందిస్థాయి సిబ్బంది నుంచి వినిపిస్తోంది.

ఇది కూడా చూడండి: ప్రపంచంలో భారత్ ని సగర్వంగా నిలబెట్టిన అరుదైన 12 అంశాలు

ఇది కూడా చూడండి: జెంటిల్‌మన్‌ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

ఇది కూడా చూడండి: దూమపానం చేసే వారికి సిరప్‌

English summary

ASP of Paderu Division Visakhapatnam District K. Sasi Kumar died under mysterious. Sasikumar death case to be investigated by CID officers.