గందరగోళం మధ్య అసెంబ్లీ వాయిదా 

Assembly Postponed To Monday

12:36 PM ON 19th December, 2015 By Mirchi Vilas

Assembly Postponed To Monday

వైసిపి ఎంఎల్ఎ రోజా ను ఏడాదిపాటు సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ , సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ వైసిపి సభ్యుల నినాదాల నడమ సోమవారానికి అసెంబ్లీ వాయిదా పడింది. సిఎమ్ చంద్రబాబు పై అనుచిత వ్యాఖ్యలు చేసారన్న అభియోగంపై మంత్రి యనమల రామకృష్ణుడు ప్రతిపాదన మేరకు నిన్నటి రోజున రోజాను ఏడాదిపాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ డాక్టర్ కోడెల శివ ప్రసాదరావు ప్రకటించిన సంగతి తెల్సిందే.

సొమ్మసిల్లిన రోజా .....

శనివారం ఉదయం అసెంబ్లీ లోకి అడుగుపెట్టిందుకు రోజా ప్రయత్నించగా , మార్షల్స్ - పోలీసులు అడ్డుకున్నారు. వారితో వాగ్వివాదానికి దిగిన రోజా ను నాంపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించారు. వైసిపి అధినేత జగన్ ఆమెను పరామర్శించారు. కాగా స్టేషన్ దగ్గర సొమ్మసిల్లి పడిపోవడంతో రోజాను నిమ్స్ కి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా వుందని నిమ్స్ వర్గాలు చెప్పాయి.
సస్పెన్షన్ ఎత్తివేయాలన్న వైసిపి - కుదరదన్న టిడిపి ......

ఇక అసెంబ్లీలో సమావేశం ప్రారంభం కాగానే రోజా సస్పెన్షన్ ఎత్తివేయాలని వైసిపి డిమాండ్ చేసింది. వైసిపి సభ్యుల నినాదాలతో సభ హోరేత్తడంతో కొద్దిసేపు సభ వాయిదా పడింది. అయినా వైసిపి సభ్యులు పట్టు విడవకుండా రోజా సస్పెండ్ ఎత్తివేయాలని నినాదాలు సాగించారు. గతంలో టిడిపి సభ్యుడు కారణం బలరాం ని ఆరునెలలపాటు సస్పెండ్ చేసినపుడు అసెంబ్లీ కమిటీ వేసి , వివరణ తీసుకున్నాకే సస్పెండ్ చేసారని , అయితే ఇప్పుడు ఎలాంటి వివరణ తీసుకోకుండా సస్పెండ్ చేయడం తగదని జగన్ అన్నారు.

రోజా సస్పెన్షన్ ఎత్తేవేయాలని , ఆప్పటి వరకు సభ జరగనిచ్చేది లేదని వైసిపి సభ్యులు నినదించారు. సస్పెండ్ అనే అంశం పూర్తిగా సభకు సంభందించిన వ్యవహారమని , సభదే అంతిమ నిర్ణయమని మంత్రి యనమల పేర్కొంటూ , సస్పెన్షన్ ఎత్తివేయడం కుదరదన్నారు. సభ సజావుగా సాగడానికి సహకరించాలని కోరారు. స్పీకర్ కూడా సభ సజావుగా సాగడానికి సహకరించాలని కోరినా ఫలితం కన్పించలేదు.

వైసిపి సభ్యుల నిరసనల నడుమ ప్రభుత్వం 5 బిల్లులను ప్రవేశ పెట్టింది. మౌలిక సదుపాయం - అభివృద్ధి సవరణ బిల్లు , విద్యుత్ సుంకం బిల్లు , నౌకాశ్రయం అభివృద్ధికి మ్యారి టైం బోర్డ్ బిల్లు , విలువ ఆధారిత పన్ను బిల్లు , విదేశీ మద్యం సవరణ బిల్లు ప్రవేశపెట్టారు. వైసిపి నిరసనలు ఆగకపోవడంతో మళ్ళీ సభ వాయిదా పడింది. అయినా పరిస్థితి మారకపోవడంతో సోమవారానికి సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.

అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మొదలైన 17వ తేదీ నుంచీ కాల్ మనీ వ్యవహారంతో అట్టుడికిపోయిన నేపధ్యంలో ఇక సోమవారం సభ ఎలా సాగనుందో మరి.

English summary

Andhra Pradesh Assembly sessions were postponed to monday . Ysrcp party had begun disquiet on the Suspension of Ysrcp MLA Roja for one year from Assembly