కత్తితో దాడి చేసిన అసిస్టెంట్‌ డైరెక్టర్‌!

Assistant Director stabbed with knife

05:28 PM ON 14th December, 2015 By Mirchi Vilas

Assistant Director stabbed with knife

హైదరాబాద్‌ ఎస్‌ఆర్‌ నగర్‌లో ధరణి సాయి రెసిడెన్సీలో దారుణం చోటు చేసుకుంది. వివరాల్లోకెలితే ధరణిసాయిరెసిడెన్సీ అథినేత శంకర్‌ రోజు రాత్రి అపార్ట్‌మెంట్‌ పైనున్న పెంట్‌హౌస్‌ వద్ద మద్యం తాగుతాడు. ఇలా మద్యం తాగడం ఆ అపార్ట్‌మెంట్‌ లో ఉండే వాళ్లకి ఇబ్బందిగా ఉండడంతో తాగవద్దని అపార్ట్‌మెంట్‌లో ఉండే వాళ్లు శంకర్‌కి చెప్పారు. అలా చెప్పడం నచ్చని శంకర్ తన కొడుకు సాయి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాడు. ఈ గొడవకి పెంట్‌ హౌస్ పై ఉన్న సినీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కారణమని అనుమానించిన సాయి తన ఫ్రెండ్స్‌తో కలిసి సత్యనారాయణ పైకి గోడవకి వెళ్లాడు.

తనని కొట్టడానికి వచ్చారని గ్రహించిన సత్యనారాయణ తనని తాను రక్షించుకోవడానికి తన చేతిలో ఉన్న కత్తితో సాయిని పొడిచాడు. ఈ ఘర్షణలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌కి కూడా కొన్ని గాయాలయ్యాయి. సాయిని హాస్పటల్‌కి తరలించారు. సాయి తండ్రి శంకర్‌ ఫిర్యాదుతో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సత్యనారాయణని పోలీసుల ఆరెస్టు చేశారు.

English summary

Assistant Director stabbed with knife