అమ్మాయి పుడుతుందని జ్యోతిష్యుడు చెప్పగానే కోడలిపై యాసిడ్ పొసేసారు

Astrologer Predicts A Baby Girl Then Women In Laws Poured Acid On Her Stomach

10:51 AM ON 3rd September, 2016 By Mirchi Vilas

Astrologer Predicts A Baby Girl Then Women In Laws Poured Acid On Her Stomach

ఆడపిల్లలను హతమార్చవద్దు. ఆడపిల్ల అయినా మగపిల్లాడైనా ఒకటే, ఇలా ఎన్ని ఉపదేశాలు చేసినా , చైతన్య పరిచే కార్యక్రమాలు చేసినా, కొంతమందికి ఇంకా జ్ఞానోదయం కలగడంలేదు. ఆడపిల్ల పుట్టిందని ఆసుపత్రిలోనే , రోడ్డుమీదో వదిలేసేవాళ్ళు కొందరైతే , చెత్తకుప్పల్లో విసిరేసి వాళ్ళు కొందరు, బస్సుల్లో, రైళ్లలో వదిలిపెట్టేవాళ్ళు మరికొందరు ... ఇక కొందరైతే కడుపులో ఉండగానే హతమార్చే చర్యలకు దిగుతున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటనే ఇది.

'మీ కోడలికి మళ్ళీ అమ్మాయే పుడుతుంది... తమ ఊరి జ్యోతిష్కుడి నుంచి ఈ మాటలు వినగానే ఆ అత్తమామలు వివేకం కోల్పోయారు. అప్పటికే ఒక అమ్మాయిని కన్న తమ కోడలు గిరిజ మళ్ళీ అమ్మాయినే కంటుందా... అని వాళ్లకు కడుపు మండిపోయింది. వెంటనే యాసిడ్ తెప్పించి కోడలి కడుపుపై కుమ్మరించారు. ఈ పాపంలో బాధితురాలి ఆడపడుచు కూడా భాగం పంచుకుంది. ఆ అమాయకురాలి గావుకేకలు విన్న స్థానికులు పరుగు పరుగున వచ్చి కాపాడారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. గత నెల 19వ తేదీన నెల్లూరులో జరిగిన ఈ సంఘటన వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.

గిరిజ ప్రస్తుతం 30 శాతం కాలిన గాయాలతో బాధపడుతోంది. గిరిజకు చికిత్స చేసిన డాక్టర్లు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఆమె మామను అరెస్ట్ చేసి హత్యాయత్నం కేసు నమోదు చేశారు. బాధితురాలిపై ఏ రకమైన యాసిడ్ పోశారో తెలుసుకోవడానికి పోలీసులు నమూనాలను రసాయన పరీక్షల కోసం పంపించారు.

కాగా, కిరోసిన్ లో ఒక రకమైన రసాయనం కలిపి ఆమెపై పోసి ఉంటారనే వాదన కూడా వినిపిస్తోంది. ఇదిలా ఉంటే, ఈ కేసు ఆస్తి తగాదాలతో ముడిపడి ఉన్నట్లు తెలుస్తోందని పోలీసులంటున్నారు. మొత్తం దర్యాప్తు పూర్తయితేగాని అసలు విషయం బయటకు రాదని అంటున్నారు.ఈ ఘటనను పలు మహిళా సంఘాలు ఖండిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:బైక్ తో స్టంట్ చేసి గర్ల్ ఫ్రెండ్ ని చంపేసిన 17 ఏళ్ళ కుర్రాడు.. తరువాత..

ఇవి కూడా చదవండి:ఇండియా ఓ గొప్ప దేశం, ఎప్పటికీ మర్చిపోలేను: ఏబీ డివిలియర్స్

English summary

Criminal were increasing day by day and recently one of the Astrologer said that their Daughter In Law will birth to a baby girl and then they tried to kill her by pouring acid on the daughter in law stomach. The daughter in law was suffering with 30 percent burn injuries.