2016 లో మీ రాశి ఫలాలు

Astrology for 2016

07:25 PM ON 31st December, 2015 By Mirchi Vilas

Astrology for 2016

కొత్త సంవత్సరం వస్తుందంటే చాలు చాలా ఉత్సాహంగా ఉంటాం. అదే విధంగా వచ్చే కొత్త సంవత్సరం ఎలా ఉంటుందా ? బాగుంటుందో లేదో ? ఈ సారైనా అదృష్టం ఉందో లేదో ? ఇలా ఎన్నో ఆలోచనలు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. మన రాశి ఫలాలు ఏం చెప్పినా వాటిని పాసిటివ్‌ గా మలుచుకొని ముందుకు వెళ్ళాలి. అందుకోసమే కదా మనం మన భవిష్యత్తు ఎలా ఉంటుందా అని ముందే తెలుసుకోవాలి అనుకుంటాం. ఏది ఏమైనా కొత్త సంవత్సరంలో రేపు అడుగు పెట్టబోతున్నాం. అందరి జీవితాలు అనందమయంగా ఉండాలి అని కోరుకుంటూ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

1/13 Pages

1. మేషం : ఆదాయం-14, వ్యయం-14, రాజపూజ్యం-3, అవమానం-6

మేషం రాశివారికి కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు ఇది మార్స్‌ని సూచిస్తుంది. ఈ సంవత్సరం లో మీకు అదృష్టం వరించనుంది. మీరు ఇల్లు కట్టాలి అనుకున్నా, ప్రేమవ్యవహారాలు, వాయిదా పడిన పనులు ఏడోకా లేకుండా సజావుగా సాగుతాయి. అంతేకాకుండా వ్యాపార వాణిజ్య రంగాలలో మంచి ఫలితాలను పొందుతారు. మీరు ఎప్పటిలాగానే కష్టించి పని చేయడం వల్ల కష్టానికి తగ్గ ఫలితాలను పొందుతారు. దీనికి తగ్గట్టుగా వర్క్‌ ఆఫర్లు మిమ్మల్ని వెతుకుంటూ వస్తాయి.

ఈ రాశి వారికి అదృష్టసంఖ్య 9. 1,2,3,6 తేదీలు, సంఖ్యలు, ఆది, బుధ, గురువారములు కలిసి వస్తాయి. స్త్రీలు అమ్మవారు స్తోత్రములు పఠించడం మంచిది.

English summary