2017 లో మన జాతకం ఇలా ఉంటుందట

Astrology for 2017

11:33 AM ON 30th December, 2016 By Mirchi Vilas

Astrology for 2017

కొత్త సంవత్సరం వస్తోందంటే బోలెడన్ని ఆశలు చిగురిస్తాయి. హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకోవడమే కాదు కొత్త సంవత్సరంలో మన గమనం ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్న ఆసక్తి అందరిలో కలుగుతుంది. గతంలో ఉగాది పండుగకు ఇలాంటి ఆసక్తి ఉండేది. రానురాను నూతన ఆంగ్ల సంవత్సరం కూడా మనకు ఎలా ఉంటుందోనని అందరూ చూసుకునే పరిస్థితి వచ్చేసింది. నక్షత్రాల ఆధారంగా , రాశుల ఆధారంగా, పుట్టిన తేదీల ఆధారంగా కూడా జాతకాలు చెబుతున్నారు. అందుకే 2017 నూతన సంవత్సర శుభవేళ జన్మ నక్షత్ర ప్రకారం మన జాతకం ఎలావుంటుందో ఒకసారి తెలుసుకుందాం

1/13 Pages

1. మేషం(అశ్విని, భరణి, కృత్తిక 1 పాదం):

ఆదాయం - 8 వ్యయం - 14 రాజపూజ్యం - 4 అవమానం - 3 . ఈ రాశివారికి ఈ ఏడాది మేష రాశి వారికి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగ, వృత్తి, వ్యాపారాల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనా మొత్తం మీద పురోగతి కనిపిస్తుంది. ఆత్మవిశ్వాసం ధైర్య సాహసాలతో చేసే ప్రయత్నాలు జయప్రదం అవుతాయి. శతృవులపై విజయం సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రమోషన్లు అందుకుంటారు. అయితే పైఅధికారులతో వ్యవహారాల్లో మౌనంగా ఉండాలట. సమాజంలో పేరు ప్రతిష్ఠలు సాధిస్తారు. స్టాక్ మార్కెట్ లావాదేవీలు అనుకూలిస్తాయి. ఆస్తులు పెంపొందించుకుంటారు. వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారికి అనుకూలం.హోటల్ , ఆహార ఉత్పత్తులు, ఔషధాలు, ఆస్పత్రులు, కేటరింగ్ , నిత్యావసరాల రంగాల వారికి ప్రోత్సాహకరం. సెప్టెంబర్ ద్వితీయార్థం నుంచి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ప్రత్యర్థులపై విజయం. ఉమ్మడి వ్యాపారం లాభిస్తుంది. కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. ఫిబ్రవరి7 నుంచి ప్రత్యర్థుల నుంచి, వైవాహిక జీవితంలో చిక్కులు ఎదురవుతాయి. జూన్ 7 తర్వాత కుదుట పడుతుంది. శని సంచారం వలన ఫలితంగా ప్రమోషన్లు అందుకుంటారు.ఇల్లు కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే కొత్త వ్యాపారాల ప్రారంభానికి తగిన సమయం కాదు. 5, 4 స్థానాల్లో రాహు సంచారం కారణంగా 2017లో ప్రేమలు బెడిసికొట్టే అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాలు మనస్తాపం కలిగిస్తాయి. కేతు సంచారం వలన ఉద్యోగంలో ప్రోత్సాహకరం. వ్యాపార రంగం వారికి ఆర్థికంగా అనుకూలం. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. దత్తాత్రేయ ఆరాధన చేస్తే శుభ ఫలితాలు పొందవచ్చట.

English summary

Astrology For 2017 is prepared by the experts of Vedic Astrology..