అసుస్ నుంచి 'ఈ బుక్'లు వచ్చాయ్

Asus Launched Two Laptops

05:39 PM ON 8th January, 2016 By Mirchi Vilas

Asus Launched Two Laptops

ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ అసుస్ సరికొత్త ల్యాప్ టాప్ లను రిలీజ్ చేసింది. ఈబుక్ ఇ402, ఈబుక్ ఇ205ఎస్‌ఏ పేరిట రెండు నూతన ల్యాప్‌టాప్‌లను మార్కెట్‌లోకి తెచ్చింది. రూ.16,990, రూ.23,990 ధరలకు ఇవి అందుబాటులో ఉన్నాయి. విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్పై ఈ రెండు ల్యాప్‌టాప్‌లు పనిచేస్తాయి. ఈబుక్ ఇ402లో 14 ఇంచ్ ఎల్‌ఈడీ డిస్‌ప్లే, 1366* 768 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.16 జీహెచ్‌జడ్ డ్యుయల్ కోర్ ఇంటెల్ సెలెరాన్ ఎన్2840 ప్రాసెసర్, 1 ఎంబీ క్యాచె, 2.58 జీహెచ్‌జడ్ బరస్ట్ ఫ్రీక్వెన్సీ, ఇంటెల్ హెచ్‌డీ గ్రాఫిక్స్ 4000, 2 జీబీ ర్యామ్, 32 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్, 0.3 మెగాపిక్సల్ వెబ్‌క్యామ్, వైఫై, బ్లూటూత్ 4.0, ఈథర్‌నెట్, హెచ్‌డీఎంఐ పోర్ట్, కార్డ్ రీడర్, యూఎస్‌బీ 2.0, 3.0 స్లాట్లు తదితర ఫీచర్లు ఉన్నాయి.

ఇక ఈబుక్ ఇ205ఎస్‌ఏలో 11.6 ఇంచ్ ఎల్‌ఈడీ డిస్‌ప్లే, 1366* 768 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.6 జీహెచ్‌జడ్ డ్యుయల్ కోర్ ఇంటెల్ సెలెరాన్ ఎన్3050 ప్రాసెసర్, 2 ఎంబీ క్యాచె, 2.16 జీహెచ్‌జడ్ బరస్ట్ ఫ్రీక్వెన్సీ, 2 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 0.3 మెగాపిక్సల్ వెబ్ కెమెరా, ఒక సంవత్సరం పాటు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365 పర్సనల్ అకౌంట్, వైఫై, బ్లూటూత్, మైక్రో హెచ్‌డీఎంఐ, ఎస్‌డీ కార్డ్ రీడర్, యూఎస్‌బీ 2.0, యూఎస్‌బీ 3.0, యూఎస్‌బీ టైప్ సి పోర్ట్ తదితర ఫీచర్లు ఉన్నాయి.

English summary

Asus launched EeeBook E402 and EeeBook E205SA. Priced at Rs. 16,990 and Rs. 23,990 respectively, the new notebooks are powered by Windows 10.