5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో జెన్‌ఫోన్‌ మ్యాక్స్‌

Asus Launched ZenFone Max Smartphone

04:22 PM ON 4th January, 2016 By Mirchi Vilas

Asus Launched ZenFone Max Smartphone

ప్రముఖ మొబైల్‌ ఫోన్‌ల తయారీ సంస్థ అసుస్‌ భారత మార్కెట్‌లోకి ఓ కొత్త స్మార్ట్‌ఫోన్‌ని విడుదల చేసింది. అసుస్‌ జెన్‌ఫోన్‌ మ్యాక్స్‌ పేరిట ఈ ఫోన్‌ని విడుదల చేసినట్టు కంపెనీ ప్రకటించింది. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ బ్యాకప్ ఈ ఫోన్ ప్రత్యేకత. సోమవారం నుంచి ప్రముఖ ఈ-కామర్స్‌ వెబ్‌సైట్‌ ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా ఈ ఫోన్‌ని కొనుగోలు చేయవచ్చు. అయితే ప్రస్తుతం ఈ ఫోన్ కు ప్రీ ఆర్డర్లను స్వీకరిస్తున్నారు. ఈ నెల 14 నుంచి ఫోన్ లను వినియోగదారులకు డెలివరీ చేస్తారు. కాగా, ఈ ఫోన్ ధరను రూ. 9,999గా అసుస్ నిర్ణయించింది. ఇందులో 5.5 అంగుళాల హెచ్ డీ ఐపీఎస్ డిస్ ప్లే, 720*1280 పిక్సల్ రిజల్యూసన్, 2జీబీ ర్యామ్‌, 1 జిగా హెడ్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 13 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమేరా, 5 మెగాపిక్సెల్‌ రేర్‌ కెమేరా, 16 జీబీ ఇంటర్నెల్‌ మెమొరీ, ఎస్డీ కార్డ్ సహాయంతో 64 జీబీ వరకు పెంచుకోవచ్చు. డ్యూయల్‌ సిమ్‌, 4జీ సదుపాయం, ఆండ్రాయిడ్‌ 5.0 లాలీపాప్‌ మొదలైన ఫీచర్లు ఉన్నాయి. 5,000 ఎంఏహెచ్‌ నాన్ రిమూవబుల్ బ్యాటరీ సహాయంతో ఈ ఫోన్ ద్వారా మరో ఫోన్ కు పవర్ బ్యాంక్ గా బ్యాటరీ అందించవచ్చు. ఈ ఫోన్ 914 గంటల బ్యాకప్ టైమ్, 38 గంటల టాక్ టైమ్ ఇస్తుందని కంపెనీ చెపుతోంది.

English summary

Asus company launched a new smartphone called Asus ZenFone Max with 5000 mah battery.The price of this smartphone was 9,999