అసుస్ నుంచి ‘జూమ్‘ ఫోన్

Asus Launched ZenFone Zoom

06:21 PM ON 7th January, 2016 By Mirchi Vilas

Asus Launched ZenFone Zoom

ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ సంస్థ అసుస్ సరికొత్త స్మార్ట్ ఫోన్ ను భారత్ లో విడుదల చేయనుంది. ఈ నెల 22న జెన్‌ఫోన్ జూమ్ పేరిట నూతన స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేయనుంది. అయితే ఈ ఫోన్ ధర వివరాలను ఇంకా వెల్లడించకున్నా.. లాస్‌వెగాస్ కన్‌జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షోలో దీన్ని ప్రదర్శించింది. డిజిటల్ కెమెరాలో మాదిరిగా ఇందులో 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ కలిగిన కెమెరాను అందించనుంది. ఈ కెమెరా 12ఎక్స్ జూమ్ ఎఫెక్ట్‌ను ఇస్తుందని అసుస్ చెబుతోంది. 5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1080*1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆండ్రాయిడ్ 5.0 లాలిపాప్, 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 2.3 జీహెచ్‌జడ్ క్వాడ్‌కోర్ ఇంటెల్ ఆటం జడ్3580 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్, 4జీ, సింగిల్ సిమ్, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, యాక్సలరోమీటర్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాంబియంట్ లైట్, గైరోస్కోపిక్, డిజిటల్ కంపాస్ మొదలైన ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి.

English summary

The ZenFone Zoom includes 64GB inbuilt storage, which can be expanded via microSD card (up to 128GB). It features 5.5-inch full-HD (1080x1920 pixels) display and sports Corning Gorilla Glass 4.