అసుస్ నుంచి జెన్ ఫోన్ జూమ్

Asus Launched Zenfone Zoom Smart Phone

12:42 PM ON 25th January, 2016 By Mirchi Vilas

Asus Launched Zenfone Zoom Smart Phone

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ ఉత్పత్తుల తయారీ సంస్థ అసుస్‌ జెన్‌ఫోన్‌ సిరీస్‌లో మరో మోడల్‌ను భారత్‌లో విడుదల చేసింది. జెన్‌ఫోన్‌ జూమ్‌ పేరుతో విడుదల చేసిన ఈ ఫోన్‌ స్పెషాలిటీ ఏమిటంటే.. 3ఎక్స్‌ ఆప్టికల్‌ జూమ్‌. ఇది ప్రపంచంలోనే అతి నాజూకైన జూమ్‌ ఫోన్‌ అని కంపెనీ వెల్లడించింది. దీని ధర రూ.37,999. దీనిని ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

జెన్ ఫోన్‌ జూమ్ ఫీచర్లు ఇవే..

5.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ ఐపీఎస్ తాకే తెర, 2.5 గిగాహెడ్జ్‌ ఇంటెల్ సూపర్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌, 5 ఎంపీ ముందు కెమెరా, 13 ఎంపీ వెనుక కెమెరా, 4 జీబీ ర్యామ్‌, 128 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ, ఆండ్రాయిడ్‌ 5.0, 3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ కెపాసిటీ, బ్లూటూత్ 4.0, వైఫై 802.11 ఏసీ, సింగిల్ మైక్రోసిమ్

English summary

Worlds Popular electronics company Asus launched a new smart phone calld Zenfone Zoom. The price of this smart phone was 37,999 and this phone comes with the features like 5.50-inch Display,2.5GHz Processor, 5-megapixel Front Camera, 13-megapixel Rear Camera,4GB RAM,3000mAh Battery