అసుస్‌ నుంచి జెన్‌ప్యాడ్‌ సీ7.0

Asus Launched Zenpad C7.0

05:49 PM ON 15th December, 2015 By Mirchi Vilas

Asus Launched Zenpad C7.0

ప్రముఖ ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ సంస్థ అసుస్‌ కొత్త ట్యాబ్లెట్ ను విడుదల చేసింది. జెన్‌ప్యాడ్‌ సీ7.0 పేరుతో కొత్త మోడల్‌ ట్యాబ్లెట్‌ను భారత మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. దీని ధర రూ.7,999గా కంపెనీ ప్రకటించింది. ఈ ట్యాబ్లెట్‌ ఆన్‌లైన్‌ షాపింగ్‌ వెబ్‌సైట్‌ స్నాప్‌డీల్‌లో అమ్మకానికి ఉంచింది. ఇందులో 7 ఇంచ్ ఎల్‌ఈడీ బ్యాక్‌లిట్ ఐపీఎస్ డిస్‌ప్లే, 1.3 జీహెచ్‌జడ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, బ్లూటూత్ 4.0, వైఫై, 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 0.3 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, 3450 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేసే ఈ ట్యాబ్ లెట్.. 8 జీబీ ఇంటర్నల్ మెమరీ ఉంది. దీనిని 64 జీబీ వరకు పెంచుకోవచ్చు. డ్యుయల్ సిమ్ సపోర్ట్ చేయడం ఈ ట్యాబ్లెట్ ప్రత్యేకత.

English summary

Asus Electronic company launched a new tab named Asus ZenPad C 7.0 (Z170MG) in Indian Market