అసుస్‌ నుంచి జెన్‌వాచ్‌ 2 

Asus Launched ZenWatch 2

06:47 PM ON 5th January, 2016 By Mirchi Vilas

Asus Launched ZenWatch 2

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల తయారీ సంస్థ అసుస్‌ జెన్‌వాచ్‌ 2ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. గత ఏడాది అసుస్‌ జెన్‌వాచ్‌ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే సిరీస్‌లో మరో వాచ్‌ను అందుబాటులోకి తెచ్చింది. జెన్‌వాచ్‌2ను రెండు వేరియంట్లలో విడుదల చేసింది. 1.45 అంగుళాల తెర కలిగిన వాచ్‌ ధర రూ.11,999 కాగా 1.63 అంగుళాల తెర కలిగిన వాచ్‌ ధర రూ.14,999. ఈ రెండు వాచ్‌లను ఆన్‌లైన్‌ షాపింగ్‌ వెబ్‌సైట్‌ ఫ్లిప్‌కార్ట్‌, అసుస్‌ ఎక్స్‌క్లూజివ్‌ స్టోర్ల నుంచి కొనుగోలు చేయవచ్చు. వాచ్‌లో క్వాల్‌కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ ప్రాసెసర్‌, 512 ఎంబీ ర్యామ్‌, 4జీబీ ఈఎంఎంసీ ఇంటర్నల్‌ మెమొరీ, బ్లూటూత్‌, వైఫై, అమోలెడ్ డిస్‌ప్లే, వాటర్ రెసిస్టెంట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 1.45 ఇంచ్ మోడల్‌లో 300 ఎంఏహెచ్ బ్యాటరీని, 1.63 ఇంచ్ మోడల్‌లో 400 ఎంఏహెచ్ బ్యాటరీని అందిస్తున్నారు.

English summary

Asus on Tuesday launched the ZenWatch 2 smartwatch in India. The successor to last year's ZenWatch, the ZenWatch 2 comes in two sizes: 1.45-inch (WI502Q) and 1.63-inch (WI501Q). The smaller version is priced at Rs. 11,999 while the 1.63-inch variant will cost you Rs. 14,999.