అసుస్ నుంచి మూడు కొత్త ల్యాప్‌టాప్స్..

Asus Launches Three New Laptops

12:17 PM ON 7th March, 2016 By Mirchi Vilas

Asus Launches Three New Laptops

ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ సంస్థ అసుస్ సరికొత్త ల్యాప్ టాప్ లను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. జెన్‌బుక్ సిరీస్‌లో యూఎక్స్303యూబీ, యూఎక్స్305సీఏ, యూఎక్స్305యూఏ పేరిట 3 కొత్త విండోస్ 10 ల్యాప్‌టాప్‌లను రిలీజ్ చేసింది. ప్రముఖ ఆన్ లైన్ స్టోర్లతో పాటు రిటైల్ షాపుల్లోనూ ఈ ల్యాప్ టాప్ లు వినియోగదారులకు లభ్యం కానున్నాయి.

జెన్‌బుక్ యూఎక్స్303యూబీ ఫీచర్లు ఇవే..

13.3 ఇంచ్ ఎల్‌ఈడీ బ్యాక్‌లిట్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1920 X 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.3 జీహెచ్‌జడ్ ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్, ఎన్‌వీడియా జిఫోర్స్ 940ఎం, ఇంటెల్ హెచ్‌డీ గ్రాఫిక్స్, 8 జీబీ ర్యామ్, 1 టీబీ హార్డ్‌డ్రైవ్, హెచ్‌డీ వెబ్‌కెమెరా, వైఫై 802.11 ఏసీ, బ్లూటూత్ 4.0, యూఎస్‌బీ 3.0 పోర్టులు, మినీ డిస్‌ప్లే పోర్ట్, హెచ్‌డీఎంఐ 1.4 పోర్ట్, దీని ధర రూ.71,490.

జెన్‌బుక్ యూఎక్స్305సీఏ ఫీచర్లు ఇవే..

13.3 ఇంచ్ ఎల్‌ఈడీ బ్యాక్‌లిట్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 2.2 జీహెచ్‌జడ్ ఇంటెల్ కోర్ ఎం3 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఎస్‌ఎస్‌డీ, దీని ధర రూ. రూ.55,490.

జెన్‌బుక్ యూఎక్స్305యూఏ ఫీచర్లు ఇవే..

13.3 ఇంచ్ ఎల్‌ఈడీ బ్యాక్‌లిట్ క్యూహెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 3200 X 1800 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.5 జీహెచ్‌జడ్ ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 512 జీబీ ఎస్‌ఎస్‌డీ, దీని ధర రూ.74,190.

English summary

Worlds Popular Asus company launched a three new laptops named Zenbook X 303 UB,Zen Book X 305 CA,Zenbook X 305 UA laptops.With the starting price of 55,490 Rupees