అసుస్ నుంచి లివ్ స్మార్ట్‌ఫోన్..

Asus Live Smartphone

12:00 PM ON 26th January, 2016 By Mirchi Vilas

Asus Live Smartphone

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ సంస్థ అసుస్ మరో స్మార్ట్ ఫోన్ ను రిలీజ్ చేసింది. లివ్ పేరిట రూపొందించిన ఈ స్మార్ట్‌ఫోన్‌ను బ్రెజిల్ మార్కెట్‌లోకి తాజాగా రిలీజ్ చేసింది. ఈ ఫోన్ ధర సుమారు రూ.14వేలు. ఈ ఫోన్ అతి త్వరలోనే ఇతర దేశాల వినియోగదారులకు కూడా లభ్యం కానుంది. జెన్ ఫోన్ సిరీస్ లో కాకుండా వేరే మొబైల్ ను అసుస్ విడుదల చేయడం గత కొద్దికాలంలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.

అసుస్ లివ్ ఫీచర్లు ఇవే..

ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, 5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 720 X 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 జీహెచ్‌జడ్ క్వాడ్‌కోర్ మీడియా టెక్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 3జీ, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 8 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 2070 ఎంఏహెచ్ బ్యాటరీ

English summary

Worlds popular electronics company Asus launched a new smartphone called Asus Live smartphone with 5 inch display 8-Megapixel Rear Camera,2-megapixel front-facing camera,2070mAh battery,Android 5.1 Lollipop,1.3 GHz quad-core MediaTek MT6580 processor