అసుస్ నుంచి 'జెన్‌ఫోన్ 2 లేజర్'

Asus New Zenfone 2 Laser

04:26 PM ON 8th December, 2015 By Mirchi Vilas

Asus New Zenfone 2 Laser

ప్రముఖ చైనా ఉపకరణాల తయారీ సంస్థ అసుస్ మరో స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. 'జెన్‌ఫోన్ 2 లేజర్ (జడ్‌ఈ601కేఎల్)' పేరిట మార్కెట్‌లోకి వచ్చిన ఈ నూతన స్మార్ట్‌ఫోన్ అన్ని ఈ-కామర్స్ సైట్స్‌లో ఇప్పుడు వినియోగదారులకు లభ్యమవుతోంది. ఈ నెల 2వ వారం నుంచి రిటెయిల్ స్టోర్స్‌లోనూ ఇది అందుబాటులోకి రానుంది.

ఆరు అంగుళాల ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే ఈ ఫోన్ ప్రత్యేకత. 3 జీబీ ర్యామ్ తో పని చేసే ఈ మొబైల్ ధర రూ.17,999 మాత్రమే. ఇంకా ఇందులో డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 5.0 లాలిపాప్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4, 64 బిట్ ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 616 ప్రాసెసర్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 4జీ ఎల్‌టీఈ, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.

English summary

Asus electronic company released its new smart phone calles asus zenfone2 laser smart phone with laser focus camera,android lolipop, 16 gb of storage etc