అసుస్ నుంచి త్వరలో క్రోమ్ బిట్

Asus To Launch Chromebit

04:56 PM ON 17th December, 2015 By Mirchi Vilas

Asus  To Launch Chromebit

ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ అసుస్ క్రోమ్ బిట్ పేరిట ఓ నూతన పాకెట్ కంప్యూటర్‌ను భారత మార్కెట్‌లోకి తీసుకురానుంది. ఈ డివైస్‌ను ఇప్పటికే పలు దేశాల్లో విడుదల చేయగా భారత్‌లో మాత్రం వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేయనుంది. ఈ కంప్యూటర్ గూగుల్‌కు చెందిన 'క్రోమ్ ఆపరేటింగ్ సిస్టమ్' ఆధారంగా పనిచేస్తుంది. యూఎస్‌బీ డ్రైవ్ సైజ్‌లో ఉండే ఈ పాకెట్ కంప్యూటర్‌ని ఏదైనా మానిటర్ లేదా టీవీ వంటి వాటికి కనెక్ట్ చేసి ఉపయోగించవచ్చు. దీంతోపాటు ఇంటర్నెట్‌ను బ్రౌజ్ చేసుకోవచ్చు. డాక్యుమెంట్స్ ఎడిటింగ్, పాటలు వినడం, వీడియోలు చూడడం వంటి పనులు కూడా చేసుకోవచ్చు. ఇందులో 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ మెమోరీ, యూఎస్‌బీ 2.0 పోర్ట్, బ్లూటూత్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ.7,999.

English summary

Asus electronics company to launch Chrome bit mini Chrome OS Computer.This device is to be Launched in 2016 January .The price of this device was Rs. 7,999