5జీ నెట్‌వర్క్‌పై ఏటీ అండ్ టీ టెస్టింగ్

AT And T to test 5G network

10:49 AM ON 16th February, 2016 By Mirchi Vilas

AT And T to test 5G network

అత్యాధునిక 5జీ మొబైల్‌ నెట్‌వర్క్‌ను పరీక్షించేందుకు అమెరికాకు చెందిన ప్రముఖ టెలికాం సంస్థ ఏటీ అండ్‌ టీ సిద్ధమైంది. ప్రస్తుతం ఉన్న నెట్‌వర్క్‌లతో పోలిస్తే వాటి కంటే వంద రెట్లు వేగంగా 5జీ నెట్‌వర్క్‌ పనిచేస్తుంది. ఇంటెల్‌, స్వీడిష్‌ నెట్‌వర్కింగ్‌ గ్రూప్‌ ఎరిక్‌సన్‌లతో కలిసి ఈ ఏడాది చివరి వరకల్లా ప్రయోగాత్మకంగా 5జీ నెట్‌వర్క్‌ను పరీక్షిస్తామని కంపెనీ తెలిపింది. గ్లోబల్‌ టెలికాం ఆపరేటర్లు 2020 సంవత్సరానికి 5జీ నెట్‌వర్క్‌ను తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నాయి. అయితే కొన్ని కంపెనీలు ముందుగానే తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ నెట్‌వర్క్‌ ద్వారా చాలా వేగంగా డేటా ట్రాన్స్‌ఫర్‌ చేయడంతో పాటు మారుమూల ప్రాంతాలకూ నెట్‌ వేగంగా అందే సౌకర్యం ఉంటుందని ఏటీ అండ్‌ టీ పేర్కొంది.

English summary

AT&T announced plans to begin testing a superfast fifth generation, or 5G, mobile network with speeds up to 100 times faster than the most rapid existing connections.