'సరైనోడు' కధని మొదట ఇద్దరు స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారట

At starting 2 heroes were rejected Sarainodu movie story

12:54 PM ON 15th March, 2016 By Mirchi Vilas

At starting 2 heroes were rejected Sarainodu movie story

రుద్రమదేవి, సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రాల తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం 'సరైనోడు'. పక్కా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, కేధరిన్ త్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో హీరో శ్రీకాంత్‌ ముఖ్య పాత్రలో నటిస్తుండగా, ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తున్నాడు. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర కథని మొదట ఇద్దరు హీరోలు రిజెక్టు చేశారట.

1/4 Pages

ఆ ఇద్దరు హీరోలు ఎవరో కాదు మాచో హీరో గోపిచంద్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. వెంకటేష్-బోయపాటి శ్రీను కాంబినేషన్ లో 'తులసి' చిత్రం తెరకెక్కించేటప్పుడు శ్రీను గోపీచంద్ కి ఈ కథని చెప్పాడట. అయితే గోపిచంద్ కు ఈ కథ నచ్చకపోవడంతో రిజెక్టు చేసాడని సమాచారం.

English summary

At starting 2 star heroes were rejected Sarainodu movie story. One is Macho hero Gopichand and another one Mega Power Star Ram Charan Tej.