దేశ చరిత్రలో వాజ్ పాయ్ అరుదైన రికార్డు

Atal Bihari Vajpayee creates record

01:00 PM ON 7th September, 2016 By Mirchi Vilas

Atal Bihari Vajpayee creates record

భారతదేశాన్ని చాలామంది ప్రధానులు పాలించారు. నెహ్రు మొదలుకొని, నరేంద్ర మోడీ వరకూ ఎందరో ప్రధానులను చూసాం. కానీ ఎవరూ క్రియేట్ చేయని అరుదైన సరికొత్త రికార్డు మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పాయ్ సొంతం చేసుకున్నారు. ఇప్పటి వరకూ ఏ భారతీయ నేత అందుకోని అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. మనదేశంలో వివిధ పథకాలకు పేర్లు పెట్టడం రివాజు. ఇందులో కాంగ్రెస్ సిద్ధహస్తులు. ఆ పార్టీ దాదాపు 50 ఏళ్ళు అధికారం చెలాయించింది. నెహ్రు, ఇందిరా, రాజీవ్ ఇలా పలు పథకాలకు పెట్టారు. అయితే అవన్నీ వారు మరణించిన తర్వాత పెట్టిన పేర్లు. కానీ జీవించి ఉండగానే అత్యధిక ప్రభుత్వ పథకాలకు పేరున్న నాయకుడిగా వాజ్ పాయ్ చరిత్ర సృష్టించారు.

ప్రస్తుతం కేంద్రంలో ప్రధానిగా వున్న మోడీ ప్రభుత్వం అత్యధిక సంఖ్యలో పథకాలకు వాజ్ పాయి పేరు పెట్టింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా అనేక పథకాలకు వాజ్ పాయ్ పేరు పెట్టారు. దీంతో ఆయన అరుదైన ఘనతను సొంత చేసుకున్నారు. ఈ విషయంలో ఆయన మాజీ ప్రధానమంత్రులు నెహ్రు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలను వెనక్కి నెట్టేశారు. మోడీ ప్రభుత్వం ఇప్పటికే అమలులో ఉన్న అనేక పథకాలకు అటల్ అన్న పదం చేర్చింది. దీంతోపాటుగా రాజస్థాన్ ప్రభుత్వం 9 వేల గ్రామపంచాయతీ కేంద్రాలకు అటల్ సేవా, సువిధ కేంద్రాలుగా నామకరణం చేసింది.

మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా అనేక పథకాలు వాజ్ పాయ్ పేరు పెట్టింది. భారత రాజకీయాలపై తనదైన ముద్రవేసిన వాజ్ పాయ్ కొంతకాలం నుంచీ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన జన్మదినమైన డిసెంబరు 25న ప్రభుత్వం సుపరిపాలన దినోత్సవంగా ప్రకటించిన సంగతి తెల్సిందే.

ఇది కూడా చదవండి: ఆ ఊరే సెపరేటు ... దిమ్మతిరిగే పేర్లు ... లైఫ్ స్టైల్ డిఫరెంట్

ఇది కూడా చదవండి: పవన్ అందంలోని సీక్రెట్ బయట పెట్టిన రేణు

ఇది కూడా చదవండి: ఛీ ఛీ ... ఆ ఎంపీ కాల్ బాయ్స్ తో రాసలీలలు

English summary

Atal Bihari Vajpayee creates record.