'కుక్క' ప్రేమ

Athena trapped on fence

07:14 PM ON 20th November, 2015 By Mirchi Vilas

Athena trapped on fence

మనషులకే కాదు మాకూ ప్రేమాబిమానాలు ఉన్నాయి అంటున్నాయి ఈ రెండు కుక్కలు. జ్యూస్ తన స్నేహితురాలు ఎధీనా ఈ రెండు కుక్కలు మంచి ఫ్రెండ్స్. ఒకరోజు అనుకోకుండా ఎధీనా ఒక కంచెలో ఇరుక్కు పోయింది. జ్యూస్ దానిని విడిచి రావడానికి నిరాకరించింది. ఎధీనా కి సహాయం అందేవరకు అది అక్కడే దానితో పాటు తోడుగా నిలిచింది. ఎధీనా కాలు ఒక కంచెలో ఇరుక్కుపోయింది మొత్తం రెండు రోజుల పాటు అలాగే గడిపింది. తెలివైన జ్యూస్ ఎధీనాకి సహాయం అందేవరకూ గిట్టిగా మొరుగుతూనే ఉంది.

ఈ దృశ్యాన్ని చూసిన కొందరి హృదయం చలించింది. దాంతో కొందరు జంతు సంక్షేమ సంఘానికి కాల్ చేసి సమాచారం అందించారు. దీంతో సంక్షేమ వర్గాలవారు అక్కడికి చేరుకొని ఎధీనాకి విముక్తి కలిగించారు. అట్లాంటా యొక్క లైఫ్లైన్ జంతుప్రాజెక్ట్ కి చెందిన కరెన్ హిర్ష్ ఈ రెండు కుక్కలగురించి మాట్లాడుతూ ఎవరో వాళ్ళకి ఫోన్ చేశారని ఎధీనా రెండు రోజులుగా తన బొటిన వేలితో ఒక కంచెకి వేలాడుతూ ఉందని చెప్పారని, ఆ విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన బయలు దేరాం అని వారు చెప్పారు. తర్వాత వారు లైఫ్లైన్ లో జ్యూస్, ఎధీనాకు ఆశ్రయం కల్పించారు. ఇదండీ కుక్క ప్రేమంటే..

English summary

Athena trapped on fence.Dog Zeus refused to leave Athena's side after she got stuck in fence.