డైరెక్టర్ లైంగిక వేధింపులు భరించలేక హీరోయిన్ ఆత్మహత్య(వీడియో)

Athira Santhosh gets suicide for director harassment

11:35 AM ON 5th October, 2016 By Mirchi Vilas

Athira Santhosh gets suicide for director harassment

ఏ రంగంలో రాణించాలన్నా ఎన్నో ఆటుపోట్లు తట్టుకుని నిలబడాలి. ఇక సినిమా ఇండస్ట్రీలో అయితే హీరోయిన్ గా ఎదగాలంటే చాలా తట్టుకోవాలి. ఇబ్బందులు, వేధింపులు సరేసరి. ఎందుకంటే, ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే అమ్మాయికి ఎదురయ్యే ఇబ్బందులు ఎన్నో ఉంటాయి. అవకాశాన్ని ఆసరా చేసుకొని ఎంతోమంది అడ్వాంటేజ్ గా తీసుకొని వేధిస్తుంటారు. ఇలాంటి వేధింపులే ఎదురయ్యాయి సినీ నటి అదితి అలియాస్ అథిరా సంతోష్ కి. దీనితో తట్టుకోలేక ఆత్మహత్యకు ప్రయత్నించడం కలకలం రేపింది. ఆ వివరాలలోకి వెళితే.. మలయాళంలో ఇప్పటికే పలు టీవీ సీరియల్స్ లో నటించిన అదితి, తమిళంలో 'నెదునల్వాడై' చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయమవుతూ ఉంది.

అయితే, చిత్ర డైరెక్టర్ సెల్వకన్నన్ లైంగికంగా వేధించడంతో తట్టుకోలేక మనస్తాపంతో అదితి ఆత్మహత్య చేసుకోడానికి ప్రయత్నించిందని అంటున్నారు. 'నెదునల్వాడై' చిత్రం షూటింగ్ మొదలైనప్పటి నుంచి సెల్వకన్నన్ తనను ఎంతో వేధించాడని, మొదట ప్రేమిస్తున్నానని చెప్పాడని, తాను నిరాకరించగా బెధిరించి గదిలో నిర్బంధించాడని వాపోయింది. నడిగర సంఘానికి ఫిర్యాదు చేస్తే, తాను మెంబర్ని కాదంటూ వారు ఫిర్యాదు తీసుకోలేదని చెప్పింది. పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదని వాపోయింది. ఇటీవల ఓ యాడ్ షూటింగ్ నిమిత్తం తాను చెన్నైకి వస్తే, రౌడీలతో వచ్చి శారీరకంగా హింసించి, లైంగికంగా వేధించాడని, చేసేది లేక ఆత్మహత్యా ప్రయత్నం చేసుకున్నానని ఆసుపత్రిలో మీడియాతో చెప్పడం కొసమెరుపు.

English summary

Athira Santhosh gets suicide for director harassment