గార్డును హత్య చేసి ఏటీఎంను దోచుకున్నారు

ATM Looters Killed Security Guard In Patna

11:26 AM ON 12th December, 2016 By Mirchi Vilas

ATM Looters Killed Security Guard In Patna

ఒకప్పుడు నేరగాళ్లకు అడ్డాగా వుండే బీహార్ ఆతర్వాత కొంత అదుపులోకి వచ్చినా మళ్ళీ పాతరోజుల్లోకి వెళుతోందా అన్నట్టు అక్కడి ఘటనలు ఉంటున్నాయి. నోట్ల రద్దు నేపథ్యంలో ఏటీఎం , బ్యాంకుల దగ్గర క్యూలు పెరగడం డబ్బుకి డిమాండ్ పెరగడం తెలిసిందే. అయితే పాట్నాలో ఓ సెంట్రల్ బ్యాంకు సెక్యూరిటీ గార్డును దుండగులు హత్య చేసి ఏటీఎం నుంచి నగదు దోచుకుపోయారు. పైగా రద్దీగా.. నిత్యం పోలీసు గస్తీతో ఉండే మౌర్య లోక్ ఏరియాలో ఈ ఘటన జరగడం సంచలనం రేపింది. దీపక్ కుమార్ అనే సెక్యూరిటీ గార్డు దుండగులను ఎదిరించినప్పటికీ ఫలితం లేకపోయింది.

సాయుధులుగా వచ్చిన దొంగలు అతడిని హతమార్చి ఏటీఎం నుంచి క్యాష్ దోచుకున్నారని, ఎంత నగదు దోపిడీకి గురైందో అంచనా వేస్తున్నామని పోలీసులు వాపోతున్నారు. దొంగలను వెంటనే పట్టుకుని శిక్షించాలని డిమాండ్ చేస్తూ మృతుని బంధువులు రాస్తారోకో జరిపారు. టైర్లను కాల్చేశారు. ఈకేసుని ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు వేగంగా సాగిస్తున్నారు.

ఇది కూడా చూడండి: ఇంట్లో బొద్దింకలతో బాధపడుతున్నారా? అయితే దీనితో నివారించొచ్చు..

ఇది కూడా చూడండి: 786 అనే నెంబర్ కు ముస్లీంలు ఇంపార్టెన్స్ ఎందుకిస్తారో తెలుసా?

ఇది కూడా చూడండి: చిదంబర రహస్యం గురించి విన్నారా? ఇప్పటికీ చిదంబరంలో కొన్ని రహస్యాలు ఉన్నాయట!

English summary

ATM Looters Killed Security Guard In Patna