ఏటీఎంలో దొంగనోట్లు

ATM Sealed For Dispensing Fake Currency Notes In Bihar

11:59 AM ON 16th December, 2016 By Mirchi Vilas

ATM Sealed For Dispensing Fake Currency Notes In Bihar

ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టలేడని ఎందుకన్నారో ఇలాంటి ఘటనలు చూస్తే తెలుస్తుంది. నోట్ల రద్దు తర్వాత రెండువేల నోట్లు ప్రవేశపెడితే, బెంగుళూరు తదిరచోట్ల వాటిని కూడా నకిలీల బెడద పరిధిలోకి తేవడం తెల్సిందే. అక్కడక్కడా రెండువేల నోట్లు దొంగనోట్లు వస్తున్నట్లు వింటున్నాం, చూస్తున్నాం కానీ ఇలా బయటే కాదు..ఏటీఎంలలోనూ దొంగనోట్లు వస్తున్నాయి. అసలే నోట్ల కొరతతో సామాన్యులు అవస్థలు పడుతుంటే ఈ కొత్త బెడద వారిని ఆందోళనకు గురి చేస్తోంది. బీహార్ లోని సీతామర్హి జిల్లా సిమ్రా గ్రామంలో పంకజ్ కుమార్ అనే రైతుకు ఓ ఏటీఎం నుంచి రెండువేల రూపాయల నకిలీ నోటు లభించింది. ఇది ఫేక్ అని తెలియని ఆ రైతు ఓ దుకాణం లో కొన్ని వస్తువులు కొని ఆ నోటును దుకాణదారునికి ఇవ్వగా ఇది నకిలీ అని, ఒరిజినల్ నోటుకు స్కాన్ చేసిందని అతగాడు చెప్పడంతో పంకజ్ కుమార్ కు నోట మాట రాక కొయ్యబారిపోయాడు. ఈ నకిలీ నోటు వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు ఆ ఏటీఎంను మూసి వేయించారు. కాగా ఎస్ బీ ఐ మేనేజరు మాత్రం ఏ టీ ఎం లో దొంగ నోట్లు వచ్చే ప్రసక్తే లేదని చెబుతున్నాడు. ఇలా అయితే ఎన్ని నోట్లు రద్దు చేసిన ఎన్ని సంస్కరణలు తెచ్చినా ప్రయోజనం ఏముంది?

ఇది కూడా చూడండి: సన్నీకి బంపరాఫర్ - అయినా పైకి చెప్పడంలేదట

ఇది కూడా చూడండి: బ్యాంక్ లో డబ్బులు వేసేటప్పుడు జాగ్రత్త లేకుంటే, ఇక బలవ్వాల్సిందే

ఇది కూడా చూడండి: వామ్మో .. దెయ్యాలున్నాయట ... ఇదిగో ఇతని కళ్ళల్లోకి చూసిందట

English summary

ATM Sealed For Dispensing Fake Currency Notes In Bihar