23 కోట్లతో పరారైన ఎటీఎం వ్యాన్ డ్రైవర్ 

ATM Van Driver Jumps With 23 Crores

12:11 PM ON 27th November, 2015 By Mirchi Vilas

ATM Van Driver Jumps With 23 Crores

ఎటీఎం కార్ డ్రైవర్ 23 కోట్ల సొమ్ముతో పరారైన ఘటన ఢిల్లీ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ప్రదీప్ సుఖ్లా ఒక ప్రైవేటు బ్యాంకు ఏటీఎం వ్యాన్ కు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. రోజూ విధి లో భాగంగా 38 కోట్ల డబ్బుతో ప్రదీప్ ఇంకా సెక్యూరిటీ గార్డులతో వివిధ ఎటీఎంలలో డబ్బు ను నింపడానికి బయలుదేరారు. కొన్ని ఎటీఎం లలో డబ్బు పెట్టిన తరువాత ఢిల్లీ లోని గోవింద పూరి కి రాగానే గోవింద పురి మెట్రో స్టేషన్ దగ్గర వ్యాన్ లోని ఆయుధాలు కలిగిన సెక్యూరిటీ గార్డు వ్యాన్ లో నుండి కిందకి దిగాడు . దీన్ని గమనించిన వ్యాన్ డ్రైవర్ ప్రదీప్ కారు తో సహా 23 కోట్ల డబ్బుతో పరారయ్యాడు . ఈ విషయాన్ని సెక్యూరిటీ గార్డు సదరు ప్రైవేటు బ్యాంకు వారికి చెప్పడం తో బ్యాంకు వారు పోలీసులకు ఫిర్యాదు చేసారు.

పరారైన డ్రైవర్ కోసం పోలీసులు ఇంకా స్పెషల్ క్రైమ్ పోలీసులు విస్త్రుత గాలింపు చేపట్టిన కొద్ది సమయం లోనే ఆ ఎటీఎం వ్యాన్ ను ఒక పెట్రోల్ బంక్ దగ్గరా స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ ఆ కారు ను పెట్రోల్ బంక్ లో వదిలి 23 కోట్ల డబ్బుతో పరారైనట్టు పోలీసులు తెలిపారు. ప్రదీప్ ను పట్టుకోవడానికి వివిధ బృందాలతో గాలింపు చేస్తున్నామని. డ్రైవర్ ప్రదీప్ పై చోరి కేసును , క్రిమినల్ కేసును పెట్టామని , డ్రైవర్ ప్రదీప్ ను అతి త్వరలోనే పట్టుకుంటాం అని పోలీసులు తెలిపారు.


English summary

Pradeep Sukhla Who Was The Driver Of ATM van jumps with 23 crores cash in delhi. He worsk in a private bank in delhi.Police files case on him and seardching for him.The ATM van founds in a petrol bunk in delhi