బిజెపి సీనియర్ నేత బ్రిజ్ పాల్ టొయోటాపై కాల్పులు

Attack on BJP leader car

01:00 PM ON 12th August, 2016 By Mirchi Vilas

Attack on BJP leader car

ఉత్తర ప్రదేశ్ బిజెపి సీనియర్ నేత బ్రిజ్ పాల్ టొయోటా కాన్వాయ్ పై గుర్తుతెలియని దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ నగరంలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటనలో దుండగులు ఆయన కాన్వాయ్ పై ఏకే-47తో దాదాపు వంద రౌండ్లు కాల్పులు జరిపినట్లు భావిస్తున్నారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన 49ఏళ్ల బ్రిజ్ పాల్ ను నోయిడాలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. దాడిలో మరో ఐదుగురు కూడా త్రీవంగా గాయపడ్డారు. బ్రిజ్ పాల్ నోయిడాలోని ఫోర్టిస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఇన్స్పెక్టర్ జనరల్ సుర్జీప్ పాండే తెలిపారు.

టొయోటా ఫార్చ్యునర్ ఎస్యూవీలో వచ్చిన దుండగులు బ్రిజ్ పాల్ ఉన్న స్కార్పియో వాహనంపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. అనంతరం దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. కాల్పులకు ఏకే-47లను ఉపయోగించారని, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు. దుండగుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బ్రిజ్ పాల్ ను కేంద్ర సహాయ మంత్రి మహేశ్ శర్మ పరామర్శించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.

English summary

Attack on BJP leader Brijpal Teotia car