ఖాన్ కారుపై రాళ్ళ వర్షం !

Attack On Shah Rukh Khan Car In Ahmedabad

11:27 AM ON 15th February, 2016 By Mirchi Vilas

Attack On Shah Rukh Khan Car In Ahmedabad

బాలీవుడ్ లో ప్రధానంగా వున్న ముగ్గురు ఖాన్ లలో షారూఖ్ తరచూ ఏదో ఓ ఇష్యూలో వార్తల్లోకి ఎక్కుతూ ఉంటాడు. సినిమా విషయాల కంటే, అదర్ ఇష్యూసే ఈ ఖాన్ విషయంలో కనిపిస్తుంటాయి. కొందరైతే ఇతన్ని కింగ్ ఖాన్ అంటూ పొగడల వర్షం కురిపిస్తారు. అయితే ఈసారి రాళ్ళ వర్షం కురిసింది. షారూక్ నటిస్తున్న తాజా చిత్రం రాయిస్ షూటింగ్ ప్రస్తుతం గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జోరుగా జరుగుతోంది. అయితే ఆదివారం తెల్లవారుజామున షారూక్ కారుపై గుర్తు తెలియని దుండగులు రాళ్లతో దాడి చేశారు. విషయం ఏమంటే, ఈ ఘటన జరిగిన సమయంలో ఆ కారులో షారూక్ లేడు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని చెబుతున్నారు. మరి .ఇది ఆకతాయిల పనా? ఒకవేళ షారూక్ ను లక్ష్యంగా చేసుకొని రాళ్ల వర్షం కురిపించారా? ఇలా రకరకాల చర్చకు దారితీసిన ఈ ఘటనపై గుజరాత్ సర్కార్ ఏ విధంగా స్పందించి చర్యలు చేపడుతుందో చూడాలి.

English summary

Shah Rukh Khan Car Attacked in Ahmedabad in Gujarat State.Presently Shah Rukh Khan was acting in the film Raees.Suddenly some of the people throwa stones at Shah Rukh Khan car at early in the morning on Sunday.In this incident no one was injured.