ముస్లింల పై యూఎస్ లో పెరిగిన దాడులు

Attacks On Muslims Raised In US

04:01 PM ON 19th December, 2015 By Mirchi Vilas

Attacks On Muslims Raised In US

అగ్రరాజ్యం అమెరికాలో ముస్లింలపై దాడులు పెరిగాయట. పారిస్ ఉగ్రవాద దాడుల ఘటన తర్వాత ఈ తరహా ఘటనలు ఎక్కువయ్యాయట. కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ తన తాజా నివేదికలో ఈ విషయం వెల్లడించింది. సాన్ బెర్నార్డినో కాల్పుల ఘటన కూడా ఇందుకు ఓ కారణమని ఈ నివేదిక అభిప్రాయపడింది. పారిస్ ఘటన అనంతరం అమెరికాలో మత విద్వేషంతో ముస్లింలపై జరుగుతున్న దాడులు మూడు రెట్లు పెరిగాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఈ తరహా దాడులు సరాసరిగా నెలకు 12గా నమోదు కాగా, పారిస్ ఉగ్రదాడుల అనంతరం ఆ సంఖ్య 38గా నమోదైనట్లు తెలిపింది. ఇటీవల రిపబ్లికన్ పార్టీ నాయకుడు డొనాల్డ్ ట్రంప్.. ముస్లింలను అమెరికాలోకి రాకుండా చేయాలని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలకు అక్కడి ప్రజల్లో పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుండటం అగ్రరాజ్యంలోని ముస్లింలను కలవరపెడుతోంది.

English summary

In US the attacks on American Muslims in the past month.I ncidents that have been nothing short of extreme, and enormous in number. In just a few weeks, there have been dozens of attacks throughout the U.S