సరికొత్తగా టెలిగ్రాం..

Attracting Features in Telegram New Update

11:20 AM ON 17th February, 2016 By Mirchi Vilas

Attracting Features in Telegram New Update

ప్రముఖ మెసెంజర్ యాప్ టెలిగ్రాం సరికొత్త ఫీచర్లతో వినియోగదారులను అలరించనుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారుల కోసం టెలిగ్రాం ఈ ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆండ్రాయిడ్ యూజర్లు ఈ యాప్‌కు చెందిన లేటెస్ట్ వెర్షన్ 3.5.1ను, ఐఓఎస్ యూజర్లు 3.5 వెర్షన్‌ను ప్లే స్టోర్‌ల నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. టెలిగ్రాం యాప్ కొత్త వెర్షన్‌లో వాయిస్ మెసేజెస్ ఫీచర్‌ను వెర్షన్ 2.0 అప్‌గ్రేడ్‌తో అందిస్తున్నారు. ఇప్పుడు యూజర్లు మరింత సమర్థవంతంగా వాయిస్ మెసేజ్‌లను పంపుకునేందుకు వీలు కల్పించారు. వారు పంపే వాయిస్ మెసేజ్‌లు ప్రస్తుతం వేవ్‌ఫామ్ విజువలైజేషన్‌తో అవతలి వ్యక్తులకు చేరుతాయి. ఇతరులు పంపిన వాయిస్ మెసేజ్‌లను వినేందుకు కొత్త తరహా ప్లేయర్‌ను అందిస్తున్నారు. ఇవే కాక ఈ యాప్‌లోని సీక్రెట్ చాట్స్ ఫీచర్‌ను 3.0 వెర్షన్‌కు అప్‌గ్రేడ్ చేశారు. దీని వల్ల మరింత సురక్షితంగా అవతలి వ్యక్తులతో చాటింగ్ చేసుకునేందుకు వీలుంది. యాప్‌లోని సూపర్ గ్రూప్స్‌లో ఒక గ్రూప్‌కు 1000 మంది వరకు యాడ్ చేసుకునే వీలు కల్పించారు. వీటితోపాటు మరెన్నో ఫీచర్లు టెలిగ్రాం యాప్ నూతన వెర్షన్‌లో లభిస్తున్నాయి.

English summary

Telegram, a popular instant messenger, has started rolling out an update to its Android and iOS apps. The update adds several new features along with some improvements like voice messaging features etc